ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 08, 2020 , 00:44:16

‘పట్టణ ప్రగతి’ పనులను పూర్తి చేయాలి

‘పట్టణ ప్రగతి’ పనులను పూర్తి చేయాలి

 సూర్యాపేట, నమస్తేతెలంగాణ :  పట్టణ ప్రగతిలో మిగిలి ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని   కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.   కలెక్టరేట్‌లో శని వారం  పట్టణ ప్రగతిపై మున్సిపల్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష  సమావేశంలో అదనపు కలెక్టర్‌ డి.సంజీవరెడ్డితో కలిసి ఆయన  మాట్లాడా రు. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో మోడల్‌ నర్సరీలను ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాలంలోనే కాకుండా సంవత్సరం పొడవున మున్సిపాల్టీల్లో, గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటాలన్నారు. అందుకు అవసరమయ్యే మొక్కలను నర్సరీల్లో సిద్ధం గా ఉంచాలన్నారు.  నర్సరీల  కోసం నిధుల కొరత ఉంటే ఈజీఎస్‌ నిధులను వినియోగించుకోవచ్చన్నారు. ఇంటి నర్సరీలను ప్రోత్సహించి ప్రజలకు  ఇంటి నర్సరీలపై అవగాహన కల్పించాలన్నారు. మున్సిపాలిటీల్లో డంపింగ్‌యార్డుల కోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్నారు. 


రోడ్‌పై వ్యా పారాలు నిర్వహించే వారి కోసం ఎక్కడెక్కడ ఉం డాలో ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి వెయ్యి జనభాకి పబ్లిక్‌ టాయ్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని సూర్యాపేట మున్సిపాల్టీ పరిధిలో 134 టాయ్‌లేట్‌లకు కేవలం 25మాత్రమే కలిగి ఉన్నాయని మిగిలిన వాటిని నిర్మించాలన్నారు. మున్సిపల్‌ పరిధిలో ఎవరైనా ప్లెక్సీలను ఏర్పాటు చేస్తే వా రిపై కఠిన చర్యలు తప్పవన్నారు. పోస్టర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఎవరైనా పోస్టర్లను తొలగించకపోతే దగ్గరుండి వాటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్త మున్సిపల్‌ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని మున్సిపాల్టీల్లో 100శాతం పన్నులు వసూలు చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో ము న్సిపల్‌ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, మున్సిపల్‌ మేనేజర్‌లు, ఏఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు. 


logo