గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 07, 2020 , 00:42:07

లక్ష్యానికి మించి పన్ను వసూలు

లక్ష్యానికి మించి పన్ను వసూలు

సూర్యాపేట సిటీ : 2019-20 ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరులో ముగియనుండడంతో జిల్లాలో 5 మున్సిపాలిటీల పరిధిలోని ఆస్తి పన్ను వసూళ్లకు అధికారులు, సిబ్బంది ఇంటింటికి తిరుగుతున్నారు. పూర్తి స్థాయిలో బకాయిలు లేకుండా వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వార్డుల వారీగా మున్సిపల్‌ అధికారులు, బిల్‌ కలెక్టర్లు, బిల్‌ కలెక్షన్‌ అసిస్టెంట్లు తమ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి పెట్టారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలోని నివాసగృహాలు, నాన్‌ రెసిడెన్షియల్‌ సముదాయాలు, ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాల నుంచి ఆస్తి పన్నుతోపాటు బకాయిలు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది లక్ష్యం ఐదు మున్సిపాలిటీల్లో రూ. 12.08 కోట్లు కాగా ఇప్పటికే రూ.12.14కోట్ల మేర వసూలు చేసి అంచనా లక్ష్యాన్ని మించి పోయారు. సూర్యాపేట మున్సిపాలిటీ అంచనా రూ. 5.6కోట్లు కాగా ఈ ఏడాది మున్సిపల్‌ కమిషనర్‌ మార్గదర్శనంలో ఇప్పటికే రూ. 7.56కోట్లు ఆస్తిపన్ను, గత బకాయిలు వసూలు 


2019-20 ఆస్తి పన్ను వివరాలు.. 

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 2019-20 ఆర్థిక సంవత్సరంలో సూర్యాపేట మున్సిపాలిటీలో ఆస్తిపన్ను అంచనా రూ. 5.5కోట్లు కాగా రూ.7.56కోట్ల వసూలు జరిగింది. కోదాడ మున్సిపాలిటీలో రూ.3.68కోట్ల అంచనాకాగా.. రూ. 23.3కోట్లు.. హుజూర్‌నగర్‌లో రూ. 1.59 కోట్లకుగాను రూ. 1.45కోట్లు.. తిరుమలగిరిలో రూ. 53.40లక్షలకు గాను రూ. 48లక్షలు.. నేరేడుచర్లలో రూ. 77.98 లక్షలకుగాను రూ. 31.39లక్షలు వసూలు చేశారు. వసూళ్లలో సూర్యాపేట మున్సిపాలిటీ రూ. 7.56కోట్లతో ముందంజలో ఉండగా నేరేడుచర్ల రూ. రూ. 31.39లక్షలు మాత్రమే వసూలు చేసి వెనుకంజలో ఉంది. 


2020-21 ఆస్తి పన్ను అంచనా..

ఈ నెలాఖరులో 2019-20 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను ముగిసిపోతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2020-21కి అధికారులు రానున్న ఆస్తి పన్ను అంచనా వేశారు. దీంతో యాజమానుల నుంచి ఆస్తి పన్నును వసూలు చేస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి జిల్లా మొత్తంగా సరాసరి 60శాతం వరకు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.


పన్ను వసూళ్లలో స్పెషల్‌ డ్రైవ్‌..

 మున్సిపాలిటీ పరిధిలో ఆస్తిపన్ను, నల్లా బిల్లులు వసూలు చేయడానికి అధికారులు స్పెసల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతి మున్సిపాల్టీలో 15 నుంచి 20మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు రోజు వారి మున్సిపాల్టీ పరిధిలోని వార్డులో డోర్‌ టూ డోర్‌ తిరిగి రావాల్సిన ఆస్తిపన్ను, బకాయిలను వసూలు చేస్తున్నారు. బకాయిలు చెల్లించని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసుల్లో స్పెషల్‌ నోటీసులు, మొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. అంతే కాకుండా మున్సిపాలిటీ పరిధిలోని జప్తు వామనాలను తిప్పుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి పన్ను కట్టని మొండి బకాయిదారులకు నల్లా కలెక్షన్‌ తొలగిస్తున్నారు. 


మొండి బకాయిదారుల్లో బడా బాబులే అధికం

సాధారణంగా ఆస్తి లేని వారే కట్టడానికి డబ్బులు అందక ఇబ్బందులు పడి మున్సిపాలిటీకి బకాయి పడుతారని అందరూ భావిస్తారు. జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లోని మొండి బకాయిదారుల లిస్ట్‌ పరిశీలిస్తే ఇది నిజం కాదని తెలుస్తుంది. ఎందుకంటే అత్యధిక మొండి బకాయిదారులు బడా బాబులే కావడం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. పట్టణాల్లో నివాసం ఉండే మధ్య తరగతి వారే భయానికో, భక్తికో ఆస్తి పన్ను, బకాయి లేకుండా కడుతున్నారని అధికారులు చెప్పడం ఆశ్చర్యకరం. ఆర్థికంగా, రాజకీయంగా పేరు ఉన్న బడాబాబులను పదే పదే అడగలేక మున్సిపల్‌ అధికారులు ఇబ్బంది పడుతున్నారనేది నిజం. 


logo