మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 06, 2020 , 01:39:56

కరోనాతో కంగారొద్దు

కరోనాతో కంగారొద్దు

సూర్యాపేట టౌన్‌ : ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌ కరోనా. ఇది ప్రపంచ అంటువ్యాధిగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఈ వైరస్‌ అత్యంత ప్రమాదకరం కాదు.. కానీ గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలున్న వారికి, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఈ వైరస్‌ సోకితే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చలి ప్రాంతాల్లో ఈ వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఎండ వేడి ప్రదేశాల్లో వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువ. కానీ ఒకరి నుంచి మరొకరికి వ్యాధి వ్యాపిస్తుండటంతో ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తిని నిరోదించేందుకు పలు చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చిన వారిని వైద్య పరీక్షలు చేసిన తరువాతనే అనుమతిస్తున్నారు. వ్యాధి వ్యాప్తి లక్షణాలు, నివారణపై ప్రజలకు తెలిసేలా జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటే వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం సులువే.  


వైరస్‌ వ్యాప్తి ఇలా.. 

శ్వాస, స్పర్శ, మాట్లాడటం, దగ్గడం, తుమ్మడం ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. అత్యంత రద్దీ కలిగిన ప్రదేశాల్లో తిరగక పోవడం, దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, చేతులతో కరచాలనం చేయడం వ్యాధి ప్రభావిత వ్యక్తి తాకిన వస్తువుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.

వ్యాధి లక్షణాలు..గుండె దడగా ఉండటం, ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరేచనాలు, గొంతునొప్పి, జ్వరం, చాతినొప్పి, దగ్గు, చలి, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే వ్యాధి లక్షణాలుగా అనుమానించవచ్చు.


జాగ్రత్తలు ..

 కరోనా వైరస్‌ కణాలు చాలా పెద్దవి. సుమారు 400 నుంచి 500 మైక్రో సైజ్‌లో ఉంటాయి. అందుకే ఏ మాస్క్‌ వాడినా వైరస్‌ లోనికి చేరే అవకాశం తక్కువ. 

ఈ వైరస్‌ గాలిలో ఉండదు. నేలపైనే ఉంటుంది. కరోనా వైరస్‌ ఏదేని లోహపు ఉపరితలం మీద 12 గంటలు ఉండగలదు. సబ్బుతో చేతులను శుభ్ర పరుచుకుంటే సరిపోతుంది. 

కరోనా వైరస్‌ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. బట్టలు సబ్బుతో ఉతికినా, ఎండలో రెండు గంటలు ఆరేసినా వైరస్‌ను అరికట్టవచ్చు. వైరస్‌ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే స్పిరిట్‌ ఆధారిత స్టెరిలైజర్‌ను ఎప్పుడూ వెంట ఉంచుకోవడం మంచిది. 

వైరస్‌ వేడి ప్రదేశాల్లో బతకలేదు. 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే చనిపోతుంది. వేడినీరు తాగడం, ఎండలో నిలబడటం లాంటివి చేయాలి. కొన్నాళ్లు ఐస్‌క్రీమ్‌ లాంటి చల్లటి పదార్ధాలకు దూరంగా ఉండటం మంచిది. 

గోరు వెచ్చని నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా ట్రాన్సిల్స్‌ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా ఊపిరితిత్తుల్లోకి కరోనా బ్యాక్టీరియా చేరకుండా నివారించ వచ్చు. 

కొన్ని రోజులపాటు జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకపోవడం చాలా మంచిది. 

చేయాల్సినవి.. 

వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పటికపుడు సబ్బుతో చేతులను కడుగుతూ ఉండాలి. 

సాధారణ పరిశుభ్రత పద్ధతుల్ని పాటిస్తూ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి గుడ్డను అడ్డంగా పెట్టుకోవాలి.

చేతులు అపరిశుభ్రంగా ఉంటే సబ్బుతో బాగా కడుక్కోవాలి. అల్కాహాల్‌ బేస్‌ ఉన్న శానిటైజర్‌, సబ్బు లాంటి వాటితో శుభ్రం చేసుకోవాలి.

ఉపయోగించిన టిష్యూలను వెంటనే మూసి ఉండే చెత్త డబ్బాలో వేయాలి. మీకు ఏ మాత్రం అనారోగ్యం అనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 

చేయకూడనివి.. 

దగ్గు జ్వరం లాంటివి ఉన్న వారితో ఎక్కువసేపు కలిసి ఉండకూడదు.  

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మొద్దు.

జంతువులకు బాగా దగ్గరగా ఉండకూడదు. పచ్చిగా లేదా సరిగా ఉడకని మాంసాహారాన్ని తీసుకోకూడదు.

జంతువులు లేదా జంతువుల మాంసాన్ని విక్రయించే ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి.

మాస్క్‌ ధరించడం మంచిది.. 

ముఖానికి మాస్కు పెట్టుకోవాలి. చుట్టు ఉన్నవాళ్లు మనల్ని అనుమానిస్తారనే భయం ఉండటం సహజం. అయినా మాస్క్‌లు వాడటం మేలు. లేకపోతే చేతి రుమాలైనా ముఖానికి కట్టుకుంటే మంచిది. శుభ్రమైన నాప్‌కిన్లు ఉపయోగించి ముఖాన్ని తుడుముకోవాలి. చేతులతో తాకకపోవడమే మంచిది. ఇతరులకు కరచాలనం, అలింగనం ఇవ్వకపోవడం ఉత్తమం. తుమ్ములు, దగ్గులు వస్తే చేయి కాకుండా నాప్‌కిన్లు, టిష్యూలు వాడండి. ముక్కు, కండ్ల ద్వారానే ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వాటిని చేతుల ద్వారా నలపకపోవడం మంచిది.  

ఆహారం.. 

 మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే పండ్లు కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గింజలు వంటివి ఎక్కువగా తినాలి. ముఖ్యంగా పుల్లటి పండ్లను బాగా తినాలి. వాటిలో సి విటమిన్‌ ఇలాంటి వైరస్‌లను శరీరంలోకి రాకుండా చేస్తుంది. మనం తినే ఆహారం అత్యంత ఉష్ణోగ్రతలో ఉడుకుతున్నందున వ్యాధి సోకే అవకాశం లేదు. మాంసాహారం తింటే కరోనా వస్తుందనేది అపోహ. కేవలం కోవిడ్‌ సోకిన పదార్థాలను ముట్టుకుంటేనే వ్యాపిస్తోంది. ఈగలు, దోమలు వాలిన ఆహారం తీసుకోకపోవడం మంచిది. 

జిల్లాలో విస్తృత ప్రచారం..

 కరోనా వైరస్‌ ఇతర దేశాల్లో వచ్చిన నాటి నుంచి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై విస్తృత ప్రచారం చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష కరపత్రాలను ముద్రించి పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టడంతోపాటు గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. కరోనా వైరస్‌పై వాల్‌పోస్టర్లను సైతం ముద్రించి పీహెచ్‌సీల వారీగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. 

హైదరాబాద్‌కు తరలినబృందం..

జిల్లాలో కరోనా వ్యాధి గ్రస్తులు ఉంటే వారికి వైద్యం అందించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలుసుకునేందుకు జిల్లాలోని పలువురు డాక్టర్లు, స్టాఫ్‌నర్స్‌లు, హెల్త్‌ అసిసెంట్లు హైదరాబాద్‌కు వెళ్లారు. వారు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విదేశాల నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు నిర్వహించే విధుల్లో పాల్గొంటున్నారు. ఇలా విడుతల వారీగా జిల్లా నుంచి తరలివెళ్లి అంతా రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో శిక్షణ పొంది జిల్లాకు వచ్చి సేవలు అందించనున్నారు. logo