మంగళవారం 07 జూలై 2020
Suryapet - Mar 06, 2020 , 01:37:10

జిల్లాలో పలుచోట్ల వర్షం

జిల్లాలో పలుచోట్ల వర్షం

సూర్యాపేట అర్బన్‌ : జిల్లాకేంద్రంలో గురువారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఒకవైపు వర్షం పడుతుంగా మరోవైపు ఎండతో వింతగా కనిపించింది. ఈ సమయంలో ఆకాశంలో ఏర్పడిన ఇంద్రధనస్సు పట్టణవాసులను కనువిందు చేసింది. జిల్లా కేంద్రంతోపాటు చివ్వెంల మండలంలో సుమారు గంటపాటు ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. వర్షంతో జిల్లాకేంద్రంలోని ప్రధాన వీధులు జలమయమయ్యాయి. ఇప్పుడిప్పుడే ఎండలు పెరుగుతున్న తరుణంలో పడిన వర్షం పట్టణ ప్రజలకు కొంత ఉపశమనం కలిగించగా పంట చేతికి వచ్చిన రైతులకు నిరాశను మిగిల్చింది. 


మార్కెట్‌లో తడిసిన కందులు.. 

సూర్యాపేట వ్యవసామ మార్కెట్‌కు కందులను తీసుకొచ్చిన రైతులకు నిరాశ కలిగించింది.  కాంటాలు ప్రారంభమయ్యే సమయానికి హటాత్తుగా వర్షం రావడంతో కందులు తడిసి ముద్దయ్యాయి. అప్పటికే అప్రమత్తమైన రైతులు, మా ర్కెట్‌ సిబ్బంది పట్టాలను అందించడంతో కొంతమేర కందులపై కప్పారు.  


కందుల కేంద్రానికి 5 రోజులు సెలవులు

 సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన కందుల బస్తాలు ఆకాల వర్షంతో తడవడంతో, వాటిని గిడ్డంగులకు ఎగుమతి చేసేందుకుగాను 5రోజులు సెలవులు ప్రకటించారు. శుక్ర, శని, ఆదివారంతోపాటు హోలీ సందర్భంగా సోమ, మంగళవారాలు కలిపి 5రోజులపాటు(6వ తారీకు నుంచి10వరకు)కందుల కొనుగోలు కేంద్రానికి సెలవులు ప్రకటించినట్లు కేంద్రం నిర్వాహకులు  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 

కోదాడలో కురిసిన వాన

కోదాడఅర్బన్‌ :  గురువారం రాత్రి కోదాడలో వర్షం కురిసింది. 7గంటలకు కొద్దిసేపు మోస్తరు వాన కురువడంతో  వీధులు  జలమయమయ్యాయి. logo