ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 06, 2020 , 00:31:54

‘ప్రగతి’ కాంతులు

‘ప్రగతి’ కాంతులు

సూర్యాపేట జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ  :  పట్టణాల్లో కనిపంచేవి చిన్నచిన్న సమస్యలే కాని వాటిని పట్టించుకునే నాదుడే ఉండరు. ఇంటి  పక్కనే ఖాళీ స్థలం ఉంటే మనది కాదుకదా అని అక్కడ చెత్తాచెదారం పడేస్తుంటారు. మురికి కాల్వల్లో నింపుతారు... రోడ్లపై చెత్త వే స్తారు... ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరి ంచి తీరా డ్రైన్‌లు జామ్‌అయి దుర్వాసన వెదజల్లితే ప్రభుత్వాన్ని తిడతారు. మున్సిపాలిటీ వారు కూడా డ్యూటీ మైండెండ్‌గా మాత్రమే విధులు నిర్వహించి తూతూ మంత్రంగా పనులు చక్కబెడుతుంటారు. దీంతో అనేక సమస్యలు పట్టణాల్లో తిష్టవేసి ఉంటూ బ్యాక్టీరియా, దోమలు పురివి ప్పి రోగాలను అంటగడుతున్నాయి. వీటన్నింటికీ విరుగుడు ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించడంతో నేడు జిల్లాలోని సూ ర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలు బాగుపడ్డాయి. పదిరోజుల్లో లక్షలాది సమస్య లు పరిష్కారమయ్యాయి.  మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి  అన్ని మున్సిపాలిటీలు పర్యటించి ప్రజల్లో అవగాహన పెం పొందించేందుకు కృషి చేశారు. అలాగే జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డిలతో పాటు జిల్లా, మండల, గ్రామస్థ్తాయి అధికారులు, వార్డు అభివృద్ధ్ది కమిటీలు విరివిగా పనిచేశాయి. పని చేయడంతో పాటు ప్రజల భాగస్వామ్యం పెం పొందించడంతో ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏరోజుకా రోజు వార్డుల్లో సమస్యలు గుర్తించడం వెంటనే పరిష్కారం చేయడం జరిగింది.


logo