శుక్రవారం 05 జూన్ 2020
Suryapet - Mar 03, 2020 , 01:23:27

అడ్మిషన్లల్లో నల్లగొండకు ప్రథమ స్థానం

అడ్మిషన్లల్లో నల్లగొండకు ప్రథమ స్థానం

నల్లగొండ విద్యావిభాగం: తెలంగాణలోనే డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయూ)లో అత్యధిక అడ్మిషన్లు చేస్తూ రాష్ట్రంలో నల్లగొండ రీజినల్‌ కోఆర్డినేటషన్‌ సెంటర్‌ ప్రథమ స్థానంలో నిలిచిందని యూనివర్సిటీ ఉమ్మడిజిల్లా డీడీ డా॥ బి.ధర్మానాయక్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని యూనివర్సిటీ రీజినల్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్జీ, ఉమెన్స్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ డా॥ రహత్‌ఖానం, డా॥ ఘన్‌శ్యాంలతో కలిసి మాట్లాడారు. 18సంవత్సరాలు నిండి ఎలాంటి విద్యార్హత లేకుండా నేరుగా బీఆర్‌ఏఓయూలో డిగ్రీలో చేరడానికి అవకాశం ఉందని, ఇందుకు నిర్వహించే అర్హత పరీక్షకు ఆన్‌లైన్‌ల్లో దరఖాస్తులు చేసుకోవడానికి ఏప్రిల్‌ 4వరకు అవకాశం ఉందని వెల్లడించారు. దరఖాస్తులు చేసిన వారికి ఏప్రిల్‌ 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కోన్నారు. అనంతరం ఎంజీయూ పాలకమండలి సభ్యులుగా నియామకమైన నల్లగొండ ఫ్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా॥ ఘన్‌శ్యాంను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందచేశారు. కార్యక్రమంలో ఎన్జీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌, ఉమెన్స్‌ కళాశాల బీఆర్‌ఏఓయూ  కోఆర్డినేటర్‌ సుంకరి రాజారాం తదితరలు పాల్గొన్నారు.


logo