గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Mar 01, 2020 , 02:18:44

సహకార రంగాన్ని బలోపేతం చేస్తాం

సహకార రంగాన్ని బలోపేతం చేస్తాం

నీలగిరి : సహకార సంఘాలను మరింత పరిపుష్టి సాధించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికలు తయారు చేశారని వాటి అమలుతో సహకార రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా ఎన్నికైన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపి ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఆధికారంలోకి వచ్చాక రాజకీయాల్లో అనేక రికార్డులు సృష్టిస్తూ సహకార ఎన్నికల్లో కూడా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. దేశంలో ఏ పార్టి సాధించలేని ఏకపక్ష విజయాలను సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ సాధించిందన్నారు. జిల్లాలో 32 జిల్లా పరిషత్‌ స్థానాలు, 95శాతం మున్సిపాల్టీలు, స్థానిక సంస్థలు, 95నుంచి 98శాతం సహకార ఎన్నికల్లో విజయం సాధించి దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మరో 3 దశాబ్దాల పాటు తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌ రాష్ట్రంగా వర్ధిల్లుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనపై ఉన్న దక్షతకు ప్రజలు మారోమారు విశ్వాసాన్ని చూపారని పేర్కొన్నారు. జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్‌లు నష్టాల్లో ఉన్నాయని, వాటిని సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలో పూర్వవైభవం తేవడం కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందన్నారు. 


సహకార సంఘాల పరిపుష్టితో టీఆర్‌ఎస్‌ రైతాంగాన్ని మరింత చెరువ అవుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని అన్నారు. అధిష్ఠానం రాష్ర్టాన్ని యూనిట్‌గా చేసుకుని సమీకరణలు చేసింది. అందులో భాగంగానే జిల్లా పాలకమండల్ల ప్రకటన చేసిందన్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధుల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌కు, ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్టీ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్‌లే ఏకగ్రీవం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 1987 నుంచి సహకార సంఘంలో అనుభవం ఉన్న వ్యక్తిని చైర్మన్‌గా చేసిందన్నారు. ఆయనకు సహకార రంగంపై అపారమైన అనుభవం ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో సహకార సంఘాలు పరిపుష్టిని సాధిస్తాయని అన్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకులు స్వీట్లు పంచుకుని సంబురాలు నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌ గొంగడి సునీత, ఎమ్మెల్సి శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లబోతు భాస్కర్‌రావు, రమావత్‌ రవీంద్రకుమార్‌, గాదరి కిశోర్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, భువనగిరి జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo