బుధవారం 30 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 29, 2020 , 01:17:14

దళితుల భూ సమస్యలను పరిష్కరించాలి

దళితుల భూ సమస్యలను  పరిష్కరించాలి

హుజూర్‌నగర్‌, నమస్తేతెలంగాణ : ఉపాధిహామీ కూ లీలకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. మండుటెండల్లో చెమటోడ్చి పనిచేసే కూలీలకు వేసవిభత్యం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు 20 నుంచి 30 శాతం కూలీ మొత్తాన్ని అధికంగా చెల్లించనుంది. దీంతో ఉపాధి కూలీలకు కష్టాలు తీరనున్నాయి. ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడే కుటుంబాలు పంటలు వేసే కాలంలో వ్యవసాయం పైనే దృష్టి పెడతాయి. వ్యవసాయ పనులు లేని రోజుల్లో ఈ పథకం కింద వచ్చే ఉపాధి కూలీ డబ్బులు వారి ఆర్థిక నష్టాలను తీర్చుతున్నాయి. ఉపాధిహామీ ద్వారా పొలాల్లోకి వెళ్లేందుకు దారులు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం, మట్టి కట్టలు, వర్మీకంపోస్టు గుంతల నిర్మాణం తదితర పనులు చేస్తున్నారు. జిల్లాలో గ్రామీణ జనాభా అధికంగా ఉండటంతో చాలా మండలాల్లో వ్యవసాయమే జీవనాధారంగా ఉంది. పంటల సీజన్‌ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి పనులు లేకపోవడంతో ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఉపాధిహామీ అమలు తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. వేసవిలో అధికంగా ఎండలు ఉండడంతో కూలీలు పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఎండ వేడిమికి సొమ్మసిల్లి పోవడంతో పాటు వడదెబ్బ తగిలి ప్రాణాలను కోల్పేయే ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వేసవిలో కూడా భత్యాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 


20 నుంచి 30 శాతం అధికం...

ప్రస్తుతం జిల్లాలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు అధికంగా చలి ఉంటుంది. వేసవి సీజన్‌ మొదలు కావడంతో పనులకు వెళ్లే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారి శ్రమకు 20 నుంచి 30 శాతం అధికంగా భత్యం పెంచేందుకు ప్రభుత్వం ముందకొచ్చింది. ఈ నిర్ణయంతో జిల్లాలో 2.84 లక్షల మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌, మేలో 30 శాతం, జూన్‌లో 20 శాతం అధికంగా వేసవి భత్యం ఇవ్వనున్నారు. 


కూలీలకు ఎండదెబ్బ కొట్టకుండా..

క్షేత్రస్థాయిలో కూలీలు పనిచేసే ప్రదేశాల్లో గుడారాలు, తాగునీటి సదుపాయాలు, షామియానాలు, చలువ పందిళ్లు, పరిశుభ్రమైన నీరు, ప్రథమ చికిత్స పరికరాలు అందుబాటులో ఉంచనున్నారు. దీని వల్ల ఎండ దెబ్బకు గురై ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం తగ్గిపోతుంది. పని వేలలు తగ్గించి ఉదయం, సాయంత్రం వేలల్లో పనిచేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. మధ్యాహ్నం వేలల్లో పూర్తిగా విరామం తీసుకుంటుండడంతో కూలీ మొత్తం తగ్గుతుంది. పనులు ముందుకు సాగకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీటి నివారణ చర్యల్లో భాగంగా అదనపు వేసవి భత్యం ఇవ్వనున్నారు. 


logo