గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 28, 2020 , 02:29:43

సీఎం సహాయనిధితో పేదలకు లబ్ధి

సీఎం సహాయనిధితో పేదలకు లబ్ధి

నార్కట్‌పల్లి : సీఎం సహాయనిధితో పేదలకు లబ్ధి కలుగుతోందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. గురువారం మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రూపని జ్యోతికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్ష ఎల్‌ఓసీ( లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌)ను ఆయన అందజేసి మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్‌ తరహా వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయనిధి ఎంతగానో దోహదం చేస్తున్నదన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మేడి పుష్పలత శంకర్‌, సాగర్ల సైదులు, బత్తుల అంజిరెడ్డి, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, చిక్కుళ్ల పాపులు, దండు శంకర్‌, జగన్‌, యాదగిరి, సూర్య, ముత్యాలు, భిక్షం, మేడి చంద్రు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలను అండగా టీఆర్‌ఎస్‌ 

 కట్టంగూర్‌ : కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన సూరారపు నాగరాజు గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి టీఆర్‌ఎస్‌ సభ్యత్వం ఉండటంతో పార్టీ నుంచి రూ.2లక్షల బీమా చెక్కు మంజూరైంది. గురువారం నార్కట్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చిరుమర్తి చెక్కును అందజేసి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్న వారందరికీ రూ.2లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, జడ్పీటీసీ తరాల బలరాములు, సర్పంచులు, ఎంపీటీసీలు సూరారపు ప్రియాంకగణేశ్‌, వడ్డె సైద్దిరెడ్డి. ఎడ్డ పురుషోత్తరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బొల్లెద్దు యాదయ్య, నాయకులు గద్దపాటి దానయ్య, పుట్ట వెంకట్‌రెడ్డి, కోనేటి నర్సింహ, అల్గుబెల్లి రాంరెడ్డి పాల్గొన్నారు.


logo