సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 28, 2020 , 02:10:24

విలీన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం

విలీన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : మున్సిపాలిటీలో విలీనమైన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌ అన్నారు.  గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 11వ వార్డు పరిధిలోని నందిపాడ్‌, నందిగూడెం కాలనీల్లోని హిందూ శ్మశానవాటిక, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలతో పాటు పలు వీధుల్లో పర్యటించి మాట్లాడారు.  హిందూ శ్మశానవాటికలో పెరిగిన  చెట్లను తొలగించాలని  సిబ్బందికి సూచించారు. నీరు, విద్యుత్‌ సదుపాయం కల్పించాలని సూచించారు.  ఉన్నత పాఠశాలలో చెత్తను తొలగించారు.  పలు కాలనీల్లో   నిరూపయోగంగా ఉన్న చేతి పంపులను మరమ్మతులు చేయించారు. కార్యక్రమంలో  వార్డు కౌన్సిలర్‌   కర్నె ఇందిరగోవిందరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ చీమ వెంకన్న, డీఈ శ్రీనివాస్‌, హసీంబాబా, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. 


తాజావార్తలు


logo