శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 27, 2020 , 02:10:43

వైకుంఠధామం నిర్మాణ పనులు పూర్తిచేయాలి

వైకుంఠధామం నిర్మాణ పనులు పూర్తిచేయాలి

నల్లగొండరూరల్‌ : పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో చేపట్టిన వైకుంఠధామం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని అన్నెపర్తి గ్రామంలో వైకుంఠధామం నిర్మాణపనులతోపాటు నర్సరీని, గ్రామంలో చేపడుతున్న ఇంకుడుగుంత పనులను పరిశీలించి మాట్లాడారు. గ్రామానికి అవసరమైన మొక్కలను నర్సరీలో పెంచుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామంలో వందశాతం ఇంకుడుగుంత నిర్మాణ పనులు పూర్తిచేయాలని సూచించారు. మర్రి, వేప మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేసి వానకాలం నాటికి ఇంకుడు గుంతలను పూర్తిచేయాలని సూచించారు. వారివెంట సర్పంచ్‌ మేకల అరవింద్‌రెడ్డి, సెక్రటరీ మందడి విజయారెడ్డి, ఏపీఓ గోపాలరెడ్డి, వార్డుసభ్యులు బోగరి రజిత, రామలింగయ్య, నర్సింహా, శ్రీను, కవిత, ఈశ్వరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.logo