గురువారం 04 జూన్ 2020
Suryapet - Feb 26, 2020 , 00:25:52

తాగునీటిపై దృష్టిసారించాలి

 తాగునీటిపై దృష్టిసారించాలి

నీలగిరి : వేసవి కాలం ప్రారంభమైనందున గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం 1, 7, 2, 4 స్టాండింగ్‌ కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా నీరు అందిస్తున్నామని, నీరు అందని గ్రామాలల్లో నీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న మిషన్‌ భగీరథ పనులు పూర్తిచేయాలని సూచించారు. మిషన్‌ భగీరథ పనులు లేని చోట నీటి ఎద్దడి ఉంటే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలు వస్తున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి నూరుశాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేస్తూ తగు కార్యక్రమాలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ ఇన్‌చార్జి సీఈఓ సీతాకుమారి, జడ్పీటీసీలు పాశం రాంరెడ్డి, చిట్ల వెంకటేశ్వర్లు, వంగూరి లక్ష్మయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నెల్లికంటి సత్యం, పల్లా

నీలగిరి: భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, పల్లా నర్సింహారెడ్డిలు ఎన్నికయ్యారు. ఈనెల 22 నుంచి 24వరకు మంచిర్యాల పట్టణంలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో ఎన్నుకున్నారు. వీరితోపాటు కౌన్సిల్‌ సభ్యులుగా ఉజ్జిని యాదగిరిరావు, పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్‌, మందడి నర్సింహారెడ్డి, బి.వెంకటరమణ ఎన్నికయ్యారు.


logo