శుక్రవారం 29 మే 2020
Suryapet - Feb 26, 2020 , 00:24:55

పెట్టుబడులు తగ్గించే దిశగా రైతులను చైతన్యం చేయాలి

పెట్టుబడులు తగ్గించే దిశగా రైతులను చైతన్యం చేయాలి

పెట్టుబడులు తగ్గించే దిశగా రైతులను చైతన్యం చేయాలి

నీలగిరి: వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించి అధిక దిగుబడులు సాధించేలా రైతులకు తగు సూచనలు సలహాలు ఇస్తూ వారిని చైతన్యం చేయాలని ఏరువాక డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త జి. నరేందర్‌ అన్నారు. మంగళవారం వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏడీ నూతన్‌కుమార్‌ ఆధ్వర్యంలో యువ రైతులకు సమగ్ర సస్యరక్షణ చర్యలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనశుద్ధి, కాలిబాటలు, వరాలపై పొద్దు తిరుగుడు, బెండ, జనుము, బంతి చెట్లను పెంచడం వలన మేలు చేసే పురుగులు పెరిగి నష్టం చేసే పురుగులను తిని పంటలను కాపాడతాయన్నారు. ప్రతి ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షణ బుట్టలు, 5 పక్షిస్తావరాలు ఏర్పాటు చేసే విధంగా రైతులను చైతన్యం చేయాలన్నారు. 2రకాల పురుగులు, తెగుళ్లకు మందుల విధానం తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో యువ రైతులు పాల్గొన్నారు.logo