గురువారం 04 జూన్ 2020
Suryapet - Feb 26, 2020 , 00:21:37

పాఠశాలలోశిథిల భవనాలను తొలగించాలి

పాఠశాలలోశిథిల భవనాలను తొలగించాలి

శాలిగౌరారం : పాఠశాల ఆవరణలో శిథిలాస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్న భవనాలు, ప్రహరీలను తక్షణమే తొలగించాలని జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి ఆదేశించారు. మండల పరిధిలోని వంగమర్తి గ్రామంలో ఇటీవల ప్రహరీ కూలి మృతి చెందిన విద్యార్థిని భ్లోరి, తీవ్రంగా గాయపడిన శిల్ప కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించగా వచ్చిన రూ. 40వేలను సుకన్య సమృద్ధియోజన పాస్‌బుక్‌లో భ్లోరీ చెల్లి ప్రణతి పేరుపై వేసి ఆమెకు అందించారు. శిల్ప కుటుంబ సభ్యులకు రూ.16వేలు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో డీఈఓ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి భ్లోరీ మృతి బాధాకరమన్నారు. వారి కుటుంబాలను ఆర్థికరంగా ఆదుకునేందుకు పీఆర్‌టీయూ సంఘం చేసిన కృషి అభినందనీయమన్నారు. పీఆర్‌ ఏఈ భరత్‌చంద్ర భ్లోరీ కుటుంబ సభ్యులకు రూ.3500 అందజేశారు. డీఈఓ సైతం తన సొంత డబ్బులతో చిన్నారులకు దుస్తులు కొనుగోలు చేసి అందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మయ్య, ఎంఈఓ నాగయ్య, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్‌, ప్రధానకార్యదర్శి రవీందర్‌రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు పున్న శ్రీనివాస్‌, లోకసాని రవికాంత్‌రెడ్డి, సారంగి నాగయ్య, నాంపెల్లి శ్రీనివాస్‌, చింతకాయల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

వల్లాల పాఠశాల తనిఖీ

మండల పరిధిలోని వల్లాల గ్రామంలోని మోడల్‌స్కూల్‌ను డీఈఓ భిక్షపతి పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ నాగయ్య, పాఠశాల ప్రిన్స్‌పాల్‌ రాగిణి తదితరులు ఉన్నారు.                                                                                  logo