ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 25, 2020 , 01:56:06

అంగరంగ వైభవంగా..

అంగరంగ వైభవంగా..

అర్వపల్లి : మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామశివారులో నూతనంగా నిర్మించిన అఖండ జ్యోతిస్వరూప శ్రీసూర్యనారయణ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠి మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవతామూర్తుల విగ్రహాలను కోలాట బృందాల ప్రదర్శన, వివిధ వేషధారణలతో నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. అఖండ జ్యోతిస్వరూప సూర్యనారయణ స్వామి దేవాలయం, మహా సౌరయాగాన్ని వేదపండితులు దీక్షా కలశస్థాపన చేశారు. ఈ సందర్భంగా విగ్నేశ్వర పూజ, ఆఖండ దీపస్థాపన, అగ్ని ప్రతిస్ఠాపన, మూల బేరాధులకు జలాది, పంచామృత, పంచగవ్య అదివాసాలు, మండప దేవతార్చన, ద్వాదశాధిత్య మంత్రజప తర్పణలు, వాస్తు బలిపహరణం, దశవిధ హారతి, మంత్ర పుష్ప అర్చన నిర్వహించారు. ఉత్సవాలనుద్దేశించి భువనేశ్వరి పీఠాధిపతి శ్రీరామనంద భారతి ప్రవచనాల ద్వారా మంగళ శాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు కాకులారపు జనార్దన్‌రెడ్డి, పండితులు హరిబాబు శర్మ, శ్రీనివాసశర్మ, స్థానిక సర్పంచ్‌ పాలెల్లి సురేశ్‌, మారం లింగారెడ్డి, కర్నాటి నాగేశ్వర్‌రావు, భాస్కర్‌రెడ్డి, నరేశ్‌, భక్తులు పాల్గొన్నారు.


logo