మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 25, 2020 , 01:51:29

మేలురకం పశుసంపదే లక్ష్యంగా..

మేలురకం పశుసంపదే లక్ష్యంగా..

సూర్యాపేట అర్బన్‌ : అంతరించిపోతున్న ఉత్తమ జాతి పశువులను అభివృద్ధి చేసేందుకు, పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 100 గ్రామాలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన మేలురకం జాతికి చెందిన పశువుల సంతతి వీర్యాన్ని స్థానిక ఆవులు, గెదెలలో కృత్రిమ గర్భధారణను ఉచితంగా చేపట్టారు. ఇప్పటికే గోపాలమిత్ర, పశువైద్యులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో 20 వేల పశువులకు ఉచితంగాగర్భధారణ చేయాలని నిర్ణయించారు. వీటితోపాటు అదనంగా మరో 60 వేల పశువులకు రూ.40 నామమాత్రపు రుసుముతో వేయనున్నారు. మొత్తం 80 వేల పశువులకు గర్భధారణ మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సుమారు 75 శాతం పూర్తి కాగా గడువులోపు పూర్తి స్థాయిలో చేయనున్నారు. 


కృత్రిమ గర్భధారణ అంటే..

పాడి పశువుల్లో జన్యు లక్షణాలు పెరుగుదలకు అనుసరించే సాంకేతిక పద్ధతుల్లో కృత్రిమ గర్భధారణ చేస్తారు. దీని ద్వారా ఉత్తమ లక్షణాలు కలిగిన దున్నలు, ఆంబోతుల నుంచి వీర్యాన్ని సేకరించి ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. నిల్వ చేసిన వీర్యాన్ని పశువులు ఎదకు వచ్చిన(గర్భధారణ)అనుకూల సమయంలో ప్రత్యుత్పత్తి నాళంలో ప్రవేశ పెడతారు. తద్వారా పశువులు గర్భందాల్చే విధంగా చేస్తారు. 


ఆవులు ఎదకు వచ్చిన 12 నుంచి 14 గంటల మధ్య గర్భధారణ చేస్తారు. గెదెలు సెప్టెంబరు నుంచి మార్చి వరకు ఎదకు వస్తుంటాయి. ఇలా ఎదకు వచ్చిన సమయంలో ప్రత్యేకంగా తయారు చేసిన వీర్యాన్ని పశువుల ఆండాశయంలో ప్రవేశ పెడతారు. గెదెలలో ఎదకాలం 24 నుంచి 36 గంటలు ఉంటుంది. ఆ సమయంలో ఆవులు, గేదెలు కృత్రిమ గర్భధారణకు అనుకూలంగా ఉంటాయి.


కృత్రిమ గర్భధారణతో లాభాలు  

మేలుజాతి ఆంబోతుల వీర్యాన్ని స్థానిక పశువుల్లో ప్రవేశపెట్టి మేలు జాతి పశువులను వృద్ధి చేస్తారు. స్థానిక పశువుల్లో మేలు జాతి లక్షణాలను, సామర్థ్యాన్ని పెంచవచ్చు. పశువుల్లో వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇలాంటి పశువుల వల్ల రైతులకు ఆర్థికంగా, వ్యవసాయంలో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పశువుల్లో గర్భధారణ శాతం పెంచవచ్చును.


మార్చి చివరి నాటికి లక్ష్యం పూర్తి 

ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ చేస్తున్నాం. మార్చి చివరి నాటికి జిల్లాలో 80 వేల జీవాలు ఎద సూదులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. దీంతో మేలు రకం 


logo