మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 22, 2020 , 04:52:58

ఓం నమో శివ రుద్రాయా

ఓం నమో శివ రుద్రాయా

హరహర మహాదేవ.. శంభోశంకర.. నీలకంఠా నమోస్తుతే.. అంటూ శివనామస్మరణలు మార్మోగాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజాము నుంచే జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు, ఆలయాల్లో భక్తులు బారులుదీరారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

  • ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
  • భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
  • ప్రత్యేక పూజలు, అభిషేకాల కోలాహలం
  • నేత్రపర్వంగా స్వామివారి కల్యాణం

హరహర మహాదేవ.. శంభోశంకర.. నీలకంఠా నమోస్తుతే.. అంటూ శివనామస్మరణలు మార్మోగాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజాము నుంచే జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు, ఆలయాల్లో భక్తులు బారులుదీరారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉపవాసాలు, జాగరణలు కొనసాగగా.. రాత్రి శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. మేళ్లచెర్వు, పిల్లలమర్రి, సోమప్ప సోమేశ్వరాలయాలకు 

భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మేళ్లచెర్వు శంభులింగేశ్వర స్వామిని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, మల్లయ్యయాదవ్‌, లింగయ్య, ఎమ్మెల్సీలు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తదితర ప్రముఖులు దర్శించుకున్నారు. 


ఓం నమఃశివాయ నామ స్మరణతో శుక్రవారం జిల్లాలోని ఆలయాలు మార్మోగాయి. మహా శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పరమ శివుడిని దర్శించుకునేందుకు ఆలయల ఎదుట బారులుదీరారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి శరణు కోరారు.  శివ లింగానికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. పిల్లలమర్రి, మేళ్లచెర్వు ఆలయాలు భక్తులతో  కిటకిటలాడాయి.  నేరేడుచర్లలో సోమప్పాలయం వద్ద ఉన్న మూసీనదిలో భక్తులు స్నానాలు ఆచరించారు. పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు భారీగా తరలిరావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.


logo