శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 22, 2020 , 04:50:17

వైభవంగా కనకదుర్గమ్మ జాతర

వైభవంగా కనకదుర్గమ్మ జాతర
  • పోటాపోటీగా ర్యాలీలు, కోలాట ప్రదర్శనలుచిలుకూరు : మండలంలోని బేతవోలు గ్రామంలో కనకదుర్గమ్మ జాతర(బండ్ల పండుగ)శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది శివరాత్రికి ముందు శుక్ర,శనివారాల్లో జరుపుకునే ఈ జాతర ఆ సమయం లో సహకార ఎన్నికలు రావడంతో ఈసారి జాతరను శివరాత్రి రోజు నుంచి జరుపుతున్నారు. ఈ జాతరలో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమ ఇండ్ల వద్ద నుంచి ప్రభ బండ్లను తీసుకొచ్చి పూజలు నిర్వహించి, ఆలయం చుట్టూ ప్రదక్షణలు నిర్వహించి అక్కడే వదిలివెళ్లారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో పోటాపోటీగా కోలాటాలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు వన భోజనాలకు వెళ్లారు. జాతరలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు.కనకదుర్గమ్మ జాతర సందర్భంగా వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఆనవాయితీగా నిర్వహిస్తున్న కోలాట ప్రదర్శనలో టీఆర్‌ఎస్‌ పార్టీ కోలాట ప్రదర్శనను రథశాల సెంటర్‌ వద్ద ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయా దవ్‌, ఎంపీపీ బండ్ల ప్రశాంతి, సర్పంచ్‌ వట్టికూటి చంద్రకళనాగయ్య ప్రారంభించగా సీపీఐ కోలాట ప్రదర్శనను గ్రామ పంచాయతీ ఎదురుగా ఏర్పాటు చేయగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గన్నా చంద్రశేఖర్‌ ప్రారంభించారు. కాంగ్రెస్‌ కోలాట ప్రదర్శనను బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేయగా ఆ పార్టీ నా యకులు అక్కినపల్లి జానకిరామాచారి, రెమిడాల ఆనంద్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ జాతరలో పార్టీల ఆధ్వర్యం లో కోలాట ప్రదర్శనలు ర్యాలీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నప్పటికినీ అందరూ కలిసి జాతరను శాంతియుతంగా విజయవంతం చేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు. కాగా ఆయా పార్టీలకు చెం దిన కార్యకర్తలు మాత్రం వారి పార్టీ కోలాట ప్రదర్శనల వద్దనే ఉండటం విశేషం. కోలాటాలు చూ సేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంధువులతో గ్రామంలోని ఇండ్లన్నీ కళకళలాడాయి.


భారీ బందోబస్తు

జాతర సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు కోదాడ రూరల్‌ సీఐ శివరాంరెడ్డి, చిలుకూరు ఏఎస్‌ఐ పులి వెంకటేశ్వర్లు ఆధ్వర్యం లో పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మండలంలోని జెర్రిపోతులగూడెం,ఆచార్యులగూడెం, చెన్నారిగూడెం గ్రామాల్లో కూడా కనకదుర్గమ్మ జాతర(బండ్ల పండుగ)ను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ జాతరలో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రభబండ్లు, కోలాట ప్రదర్శనలతో గ్రామాల్లో సందడి ఏర్పడగా భక్తులు, బంధువులతో జాతర వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఎంపీపీ బండ్ల ప్రశాంతికోటయ్య, జడ్పీటీసీ బొలిశెట్టి శిరీష, సర్పంచ్‌ వట్టికూటి చంద్రకళ, మాజీ జడ్పీటీసీ శివాజీనాయక్‌, మాజీ ఎంపీపీలు బొలిశెట్టి నాగేంద్రబాబు, బజ్జూరి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు ధనమూర్తి, సైదులు, మాజీ సర్పంచ్‌లు తాళ్లూరి పద్మాశ్రీనివాస్‌, రెమిడాల ఆనందరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాషం సైదులు, వైస్‌ చైర్మన్‌ జానకిరామాచారి, వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ పాల్గొన్నారు. 


logo