మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 20, 2020 , 01:10:58

పట్టణ ప్రగతి ప్రణాళికలు రూపొందించాలి

పట్టణ ప్రగతి ప్రణాళికలు రూపొందించాలి


హుజూర్‌నగర్‌, నమస్తేతెలంగాణ :   ప్రభుత్వం త్వర లో చేపట్టనున్న పట్టణ ప్రగతిని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. పట్టణంలో శ్మ శాన వాటిక, వైకుంఠధామం, డం పింగ్‌ యా ర్డులను బుధవారం ఆయన పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా నిర్మిస్తున్న వైకుంఠ ధామంలో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు గుండా రమేష్‌ వైకుంఠ ధామానికి  వాహనం కావాలని, శ్మశాన వాటికలో మట్టిని తొలిగించాలని అడిగారు. దీనిపై త్వరలోనే ని ర్ణయం తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. అనంతరం మున్సిపాలిటీలో కంప్యూటర్‌లో డాటా ఎంట్రీ వివ రాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో హుజూర్‌నగర్‌కు వస్తానని, ఈ లోగా పట్టణంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలన్నారు. అధికారులు పనులపై అలసత్వం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కమీషనర్‌ నాగిరెడ్డి, తహసీల్దార్‌ జయశ్రీ, ఏఈ ప్రవీణ్‌ పాల్గొన్నారు.  


మునగాల నర్సరీ ఆకస్మిక తనిఖీ  

మునగాల  : మండల కేంద్రంలో  జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామ నర్సరీని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా వన సేవకురాలును వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూన్‌లో నిర్వహించనున్ను ఆరవ విడత హరితహారంలో నర్సరీ ద్వారా ఎన్ని మొక్కలు పెంచుతున్నారో కలెక్టర్‌ ఆరా తీశారు. ప్రజల నుంచి డిమాండ్‌ మేరకు  నర్సరీ ద్వారా ఆ మొక్కలు పెంచాలన్నారు.  అనంతరం రికార్డు పరిశీలించారు.


logo