సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 19, 2020 , 01:58:25

జాబ్‌ మేళాకు విశేష స్పందన

జాబ్‌ మేళాకు విశేష స్పందన

రామగిరి : నల్లగొండలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. 9 కంపెనీలు ఉద్యోగ మేళాలో అర్హులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నట్లు జిల్లా ఇన్‌చార్జి ఉపాధి కల్పన అధికారి అక్బర్‌ అబీ తెలిపారు. హాజరైన వారందరికీ తొలుత రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. 84మంది షార్టు లిస్టులో ఎంపిక చేసి 15 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశామని వివరించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. logo