శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 19, 2020 , 01:57:42

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

మాడ్గులపల్లి : పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని పశుసంవర్థ్ధకశాఖ జిల్లా అధికారి డాక్టర్‌ శ్రీనివాసరావు కోరారు. మంగళవారం మండలంలోని మాచనపల్లి గ్రామంలో టీకాల పంపిణీ తీరును ఆయన పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పశుసంరక్షణపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. వైరస్‌ ద్వారా పశువులకు ఈ వ్యాధి వ్యాపిస్తుందని పేర్కొన్నారు. వ్యాధి బారిన పడిన పశువులు అధిక జ్వరంతో బాధపడతాయని, నోరు నుంచి నురుగ కారుతుందని, నోట్లో, కాళ్ల గిట్టల నడుమ బొబ్బలు ఏర్పడతాయని తెలిపారు. ఈ వ్యాధి కారణంగా పశువులు చనిపోకున్నా పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గి రైతులకు ఆర్థ్ధికంగా నష్టం జరిగే అవకాశం ఎక్కువని పేర్కొన్నారు. వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్నదని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీకాలు వేయడంలో జాప్యం వహిస్తే అధికారులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఏహెచ్‌ఓ రాచకొండారెడ్డి ఉన్నారు. 


logo