ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 18, 2020 , 01:29:56

శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

గరిడేపల్లి : మండల కేంద్రంలో గల పా ర్వతీ, రామలింగేశ్వర స్వామి దేవాలయంలోని శివలింగం, పార్వతి దేవి అమ్మవారి విగ్రహాలను సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో సూర్యకిరణాలు తాకాయి. మాఘమాసం శివరాత్రి పండుగకు ముందు రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే శుభాలు జరుగుతాయని అర్చకులు తెలిపారు. 


మేళ్లచెర్వులో..

మేళ్లచెర్వు : స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం స్వామివారికి సూర్యకిరణాలు తాకాయి.  ప్రతి ఏటా శివరాత్రికి ముందు  విశేషంగా ఈ ఘటన జరుగుతుందని అర్చకులు వివరించారు. అనంతరం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని పూలతో అలంకరించారు. బక్కమంతులగూడెం వాస్తవ్యులు గంగసాని సావిత్రమ్మ-నరేందర్‌రెడ్డి స్వామివారికి రూ.15 వేల విలువైన వెండి పళ్లెం బహూకరించారు. హైదరాబాద్‌కు చెందిన చిరంజీవి ప్రసాద్‌-భారతి దంపతులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


logo