మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 16, 2020 , 02:24:09

సహకార పోలింగ్‌ 81.24%

సహకార పోలింగ్‌ 81.24%

సూర్యాపేట జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : జిల్లాలో మొత్తం 47 పీఏసీఎస్‌ల పరిధిలోని 611 డైరెక్టర్లకు గాను పొనుగోడు వాయిదా పడడం... అలాగే మూడు ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో అభ్యర్థులు లేక 595 డైరెక్టర్లకే ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం విధితమే. మిగిలిన 46 పీఏసీఎస్‌లలో 10 పీఏసీఎస్‌లు వందశాతం ఏకగ్రీవం డైరెక్టర్లు 297మంది ఏకగ్రీవం అయ్యారు. దీంతో జిల్లాలో మిగిలిన 289 డైరెక్టర్లకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడు గంటలకే ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి రెండు గంటలకు ఒక సారి అధికారులు పోలింగ్‌ శాతం నమోదు చేయగా తొలి రెండు గంటలకు అంటే ఉదయం 9గంటల వరకు 23.61శాతం పోలింగ్‌ నమోదు కాగా 11గంటలకు 58.16శాతం నమోదు కాగా మధ్యాహ్నం 12గంటలకు 69.11శాతం ఉండగా పోలింగ్‌ పూర్తయ్యే సమయానికి 81.24 శాతంగా నమోదైంది. తదనంతరం ఒంటి గంట నుంచి 2గంటల వరకు లంచ్‌ విరామ సమయం తీ సుకున్న అధికారులు ఆ వెంటనే ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో వార్డుల వారీగా కౌంటింగ్‌ ప్రారంభించి ఫలితాలు వెల్లడించారు. ఫలితాల అనంతరం ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం కోసం అన్ని పీఏసీఎస్‌లలో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 9గంటలకు రహస్య ఓటింగ్‌ పద్ధతిన ఆయా పీఏసీఎస్‌లలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలను నిర్వహించనున్నారు.


logo