గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 14, 2020 , 03:38:37

మరో 45 రోజులు గోదావరి జలాలు

మరో 45 రోజులు గోదావరి జలాలు

యాసంగికి సరిపడా నీటి విడుదల విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పెన్‌పహాడ్‌ మండలంలో ఎస్సారెస్పీ కాల్వల పరిశీలన మా దేవుడు మీరేనంటూ రైతుల ఆనందం

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేటకు గత వంద రోజులకు పైగా వస్తున్న గోదావరి జలాలు రైతుల కళ్లల్లో వెలుగులు నింపాయని, ఈ ఘనత ముమ్మాటికీ సీఎం కేసీఆర్‌దేనని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సేవాలాల్‌తండా సర్పంచ్‌ గుగులోతు కవిత, ఎంపీటీసీ గుగులోతు మంత్రినాయక్‌, ఉపసర్పంచ్‌ సుజాతలతోపాటు నెమ్మికల్‌, ఏపూరు గ్రామాల నుంచి సుమారు 200మంది టీఆర్‌ఎస్‌లో చేరగా మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతోనే జిల్లాలో బీడు భూములు సైతం సస్యశ్యామలమయ్యాయని పేర్కొన్నారు. రైతును రాజు చేసేందుకు రైతుబంధు అందించడంతోపాటు రుణమాఫీ చేసి రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రిగా  కేసీఆర్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. 


రైతులు అప్పులు చేయకుండా వ్యవసాయం చేయాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి కల నేటికి నెరవేరిందని, దీంతో బంగారు తెలంగాణకు బాటలు పడుతాయని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ కొంతమంది నాయకులు మూర్ఖపు వాదన చేస్తున్నారని, అలాంటి వారికి  సంక్షేమ పథకాల లబ్ధిదారులే సమాధానం చెప్పేలా వారిలో చైతన్యం నింపాలని పార్టీ శ్రేణులకు సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రత్యర్థి పార్టీలన్నీ ఖాళీ అవుతున్నాయని, అది చూసిన నాయుకులు ఏం మాట్లాడాలో తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ వై.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  


అభివద్ధిని చూసే చేరికలు

అత్మకూర్‌ ఎస్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రాథమిక సహకార సంఘం ఏపూర్‌ 12వ వార్డు బీజేపీ బలపర్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి బీరవెళ్లి శ్రీనివాస్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ వెంకటనారాయణ, పాటి నాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


మరో 45రోజులు కాళేశ్వరం నీళ్లు  

పెన్‌పహాడ్‌ : మరో 45రోజులపాటు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి సాగు నీరు ఇవ్వనున్నట్లు విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. గురువారం మండలంలోని చిన్నసీతారాంతండా, పెద్ద సీతారాంతండా, చెట్లముకుందాపురంలో మంత్రి ఆకస్మిక పర్యటన చేసి తండావాసులతో మాట్లాడారు. గత దసరా ముందు తండా వాసులకు ఇచ్చిన హామీ మేరకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలు తీసుకొచ్చినట్లు తెలుపడంతో తండా రైతులు ఆనందభాష్పలతో మంత్రిని అక్కున చేర్చుకున్నారు. మీరే మా దేవుడు..ఇచ్చిన మాట ప్రకారం నీళ్లు ఇచ్చి మా బాధలు తీర్చిన దేవుడని తండావాసులు ఆనందం వ్యక్తం చేశారు. 


మంత్రి కొద్దిసేపు తండావాసులతో ముచ్చట్లలో మునిగిపోయారు. తండావాసులకు కావాల్సిన సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం ఎండలు మండిపోతున్న దృష్ట్యా యాసంగి పంటల సాగు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గోదావరి జలాలు మండలానికి వచ్చి 150రోజులైన తరణంలో మండలంలోని ఎస్సారెస్పీ కాల్వ చివరి భూముల వద్ద గోదావరి జలాల పరిస్థితిపై ఆరా తీసేందుకు ఈ ఆకస్మిక పర్యటన అన్నారు. వచ్చే ఏడాదిలో ఎక్కడైతే కాల్వల్లో అడ్డంకులు ఉన్నాయో అక్కడ పనులు వేగవంతం చేసి పనులు పూర్తిచేయిస్తానని హామీ ఇచ్చారు. కాళేశ్వరం జలాలతో ఎండకాలంలోనూ చెరువులు, కుంటలు అలుగుపోస్తుండడం సంతోషకరంగా ఉందని తండావాసులు, రైతులు మంత్రికి కరచాలం చేయడంతో మంత్రి ఆనందంలో మునిగిపోయారు. మంత్రి వెంట ఎంపీపీ నెమ్మాది భిక్షం, సర్పంచ్‌ శోభారాణి, లక్ష్మణ్‌నాయక్‌, తూముల ఇంద్రసేనారావు, మిర్యాల వెంకటేశ్వర్లు, మామిడి వెంకటయ్య, గండు శ్రీను, అన్నదేవర అంజయ్య, వెంకన్న తదితరులు ఉన్నారు.  


logo