శుక్రవారం 05 జూన్ 2020
Suryapet - Feb 13, 2020 , 04:03:07

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నకిరేకల్‌, నమస్తేతెలంగాణ : పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభు త్వ ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. నకిరేకల్‌ మండలం మోదినిగూడెం గ్రామానికి చెందిన జవ్వాజి సాంబయ్యకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.44వేల చెక్కును బుధవారం స్థానికంగా తన క్యాంపు కార్యాలయంలో లబ్ధ్దిదారుడికి ఆయన అందజేసి మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్‌స్థాయి వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయనిధి ఎంతగానో దోహదం చేస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ మానవతా దృక్పథంతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కార్యక్రమంలో పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, చౌగోని శంకర్‌, నోముల కేశవరాజు, కృష్ణకాంత్‌ పాల్గొన్నారు.


logo