శుక్రవారం 05 జూన్ 2020
Suryapet - Feb 12, 2020 , 03:46:44

నీటి పొదుపుతోనే భవిష్యత్‌

నీటి పొదుపుతోనే భవిష్యత్‌

తాగునీటి కరువును ఎదుర్కొనేలా ఇంట్లో నీటి వినియోగాన్ని తగ్గిస్తూ ఓ వైపు వృథా నీటిని అరికడుతూ మరోవైపు అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది. ఇండ్లలో అవసరాలకు వినియోగించే నీటిలో అధిక శాతం వృథాగా పోతున్నాయి. ఉదయాన్నే నిద్రలేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రపోయే వరకు నీటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే దాన్ని పొదుపుగా వాడుకుంటేనే మనుగడ సాధ్యం. నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌, బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ లెక్క ప్రకారం మనిషికి రోజుకు 135 లీటర్ల నీళ్లు అవసరమవుతుంది. దీన్ని గుర్తుంచుకొని నీటిని పోదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. విచ్చలవిడిగా నీటిని వృథా చేస్తే తీరని వ్యధను అనుభవించక తప్పదు. 

మహిళలే శ్రీకారం చుట్టాలి 

ఇంట్లో ఆర్థికంగా వ్యవహరించే ప్రతి మహిళకు డబ్బును ఎంత జాగ్రత్తగా ఖర్చుచేయాలో బాగా తెలుసు. వచ్చిన ఆదాయంలో ఏ పనికి ఎంత ఖర్చు చేయాలో.. ఎంత దోచుకోవాలో ప్రణాళిక రూపొందించి అమలు చేయడంలో మహిళలు సిద్ధహస్తులు. ఇంటి ఆర్థికశాఖను గాడిలో పెట్టిన మహిళలే నీటిని పొదుపు చేయడనాకి బాధ్యతలను చేపట్టాల్సిన తరుణం వచ్చింది. వంటపాత్రలు, కూరగాయలు, ఇల్లు, వాకిలిని శుభ్రం చేయడానికి, దుస్తులను ఉతకడానికి నీటిని అతిగా వినియోగిస్తూ ఎందరో వృథా చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లోనే చిన్నపాటి మెలుకవలు పాటిస్తే నీటి దుబారాను అరికట్టవచ్చన్న సంగతిని ఎక్కువ మంది విస్మరిస్తున్నారు.  

నీటి పొదుపు ఇలా.. 

  • l  ఇంటిని శుభ్రం చేసేటప్పుడు బకెట్ల కొద్దీ నీటిని వృథా చేస్తుంటారు. అదే స్పాంజి లేక శుభ్రపరిచే కర్ర, వస్ర్తాన్ని వినియోగించడం ద్వారా చలా వరకు నీటిని ఆదా చేయొచ్చు. 
  • l  ఇంట్లో కుళాయిలు, నీటి తొట్టెలు లీకేజీల కారణంగా నీరు ఎక్కువగా వృథా అవుతుంది. ఒక్కో చుక్క నీరు లీకైతే రోజులో దాదాపు నాలుగు లీటర్లు నీరు వృథా అవుతున్నట్లే. దీన్ని గమనించి అరికట్టగలిగితే ఎంతో ప్రయోజనం. 
  • l  దుస్తులను ఉతికేందుకు ఎక్కువ మంది మహిళలు వాషింగ్‌ మెషీన్‌లనే వినియోగిస్తున్నారు. వీటితో నీటి వినియోగం అధికం, ఒకటి, రెండు దుస్తులను కాకుండా ఎక్కువ సంఖ్యలో దుస్తులు ఒకేసారి ఉతకడం వల్ల నీటి వృథాను భారీగా అరికట్టవచ్చు.
  • l  కూరగాయాలను కుళాయి కింద ఉంచి ఎక్కువ మంది కడిగేస్తుంటారు. దీంతో నీరు వృథా అవుతుంది. ఒక పాత్రలో నీరుపొసి శుభ్రం చేసుకుంటే చాలా వరకు నీటని ఆదా చేయొచ్చు. పైగా ఆ నీటిని సింకు కాల్వల్లో వేసే బదులు మొక్కల పెంపకానికి వాడొచ్చు. 
  • l  స్నానానికి షవర్‌, తొట్టెకు బదులుగా బకెట్‌ నీటితో చేస్తే 20 లీటర్ల నీరు సరిపోతుంది. 
  • l  పళ్లు తోముకునేటప్పుడు వాష్‌బేసిన్‌లో కుళాయిని చాలా మంది అలాగే వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల భారీగా నీరు వృథా అవుతుంది. అలా కాకుండా కుళాయిని కట్టేసి బ్రష్‌ చేయడం పూర్తయిన తర్వాత విప్పితే నీరు ఆదా చేయొచ్చు. 


logo