శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 12, 2020 , 03:42:25

హైనా.. హైరానా..!

హైనా.. హైరానా..!

హాలియా, నమస్తే తెలంగాణ/పెద్దవూర : అనుముల మండలంలోని కొసలమర్రి, వెంకటాద్రిపాలెం, పెద్దవూర మండలంలోని కొత్తలూరు శివారులో హైనా సంచరిస్తున్నట్లు పుకార్లు లేవనెత్తడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొసలమర్రి శివారులోని బాసిరెడ్డి కృష్ణారెడ్డి బత్తాయితోటలో అంతరపంటగా సాగుచేసిన పుచ్చతోటలో మొదట చిరుత పాదముద్రలుగా కనిపించాయి. దీంతో ఆందోళనకు గురైన రైతు వెంటనే సాగర్‌ ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించాడు. హుటాహుటీన కొసలమర్రి, వెంకటాద్రిపాలెం గ్రామాలకు చేరుకున్న ఫారెస్ట్‌ అధికారులు అశోక్‌రెడ్డి, పార్వతి పాదముద్రలు, ఆనవాళ్లను సేకరించారు. చిరుత పులినా లేక హైనానా అనే విషయమై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టారు. అనంతరం ఫారెస్ట్‌ అధికారి అశోక్‌రెడ్డి మాట్లాడుతూ చిరుత నడిచిన ఆనవాళ్లు లేవని, కేవలం రెండు హైనాలు సంచరిస్తున్నట్లు పాదముద్రలను బట్టి తెలుస్తుందన్నారు. వాటిలో పెద్దది ఒకటి, చిన్నది ఒకటి ఉన్నట్లు గుర్తించిన్నట్లు తెలిపారు. హైనాను పట్ట్టుకునేందుకు పలు ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెండ్రోజుల క్రితం ముక్కమాల చెందిన రైతు పొలంలో చిరుత సంచరించిన్నట్లు అధికారులకు ఫిర్యాదులందిన్నట్లు తెలుస్తోంది. దీంతో పరిసర గ్రామాల్లోని వ్యవసాయ భూములకు, బత్తాయితోటలకు వెళ్లిన రైతులకు చిరుత భయం వెంటాడుతుంది. 


logo