బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 12, 2020 , 03:41:03

టీఆర్‌ఎస్‌ పాలనలోనే దేవాలయాల అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ పాలనలోనే దేవాలయాల అభివృద్ధి

నార్కట్‌పల్లి : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలోనే దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గోపలాయపల్లి శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అనువంశిక చైర్మన్‌ కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, ఇన్‌చార్జి ఈఓ సులోచన ఆలయ ఆచారం ప్రకారం పూర్ణకుంభంతో ఎదురేగి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండా, చిరుమర్తి మాట్లాడుతూ కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి దేవాలయాన్ని ఎంతో అభివృద్ధిపరిచారని ప్రభుత్వ సహకారంతో క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని హామీఇచ్చారు. ముఖ్యంగా స్వామివారి కల్యాణ మండపం వద్ద ఇబ్బందులు ఉన్నందున వచ్చే ఏడాది స్వామివారి కల్యాణ మహోత్సవానికి మండపాన్ని  ఆధునీకరించి భక్తులు ఇబ్బందులు లేకుండా కల్యాణాన్ని కనులారా తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. అదేవిధంగా మారుమూల గ్రామాల నుంచి గుట్టకు వచ్చే విధంగా బీటీ రోడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే రోడ్డు మర్మమతుల విషయంలో సర్వే జరిగిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డిల సహకారంతో క్షేత్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెర్వుగుట్టు దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌ రెడ్డి, సర్పంచ్‌లు గోసుల భద్రాచలం, దూదిమెట్ల స్రవంతి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ పుల్లెంల ముత్తయ్య, ఉప సర్పంచ్‌ సిరిపంగి స్వామి, దుబ్బాక శ్రీధర్‌, పుల్లెంల వెంకట్‌ పాల్గొన్నారు.logo