గురువారం 04 జూన్ 2020
Suryapet - Feb 12, 2020 , 03:35:43

సంక్షేమ పథకాల్లో తెలంగాణ నెంబర్‌వన్‌

సంక్షేమ పథకాల్లో తెలంగాణ నెంబర్‌వన్‌

దేవరకొండ, నమస్తేతెలంగాణ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశంలో నెంబర్‌వన్‌ స్థానంలో ఉందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి నుంచి 179 మందికి మంజూరైన రూ.43.90 లక్షల చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను అమలుచేస్తున్నారని అందులో భాగంగానే దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికి సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమంకోసం సీఎం కేసీఆర్‌ నిర్విరామ కృషి చేస్తున్నారన్నారు. పంట సాయం, రైతుబీమా వంటి పథకాలతో రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ వంటి మంచి పథకాలు మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ శిరందాసు కృష్ణయ్య, నాయిని సుధీర్‌రెడ్డి, రమావత్‌ లాలు, ముత్యాల సర్వయ్య, ఏర్పుల గోవింద, లోకసాని తిర్పతయ్య, ఆరేకంటి రాములు, బొడ్డుపల్లి కృష్ణ, అనుపటి లక్ష్మయ్య, విష్ణు, భాస్కర్‌రెడ్డి, సూరి, అంజల్‌రావు, బాలు పాల్గొన్నారు.


logo