ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 11, 2020 , 02:45:37

ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని అభినందించిన ఎమ్మెల్యే చిరుమర్తి

ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని అభినందించిన ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల : సహకార సంఘాల ఎన్నికలలో భాగంగా గుండ్రాంపల్లి సహకార సంఘం నుండి ఎన్నికైన ఐదుగురు డైరెక్టర్‌లను నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అభినందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లు ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి, రుద్రారం బిక్షం, గంగాపురం భాస్కర్‌  తదితరులను అభినందించిన ఎమ్మెల్యే మిగిలిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్మినేడు ఎంపీటీసీ దేవరపల్లి సత్తిరెడ్డి, నాయకులు కొలను వెంకటేష్‌, అంతటి శ్రీనివాసు, రుద్రారం శ్రీను పాల్గొన్నారు. 

తాటికల్లు పీఏసీఎస్‌లో 3 ఏకగ్రీవం

నకిరేకల్‌, నమస్తే తెలంగాణ : తాటికల్లు పీఏసీఎస్‌లో మొత్తం13డైరెక్టర్ల స్థానాలు ఉన్నాయి. 6,9,10వార్డుల్లో బొప్పని సరోజ, పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, జాజు సతీష్‌లు ఏకగ్రీవం ఎన్నికయ్యారు. మిగత వార్డుల్లో 69 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖాలు చేయగా అందులో 33 ఉపసంహరించుకోగా 29మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి నీలారెడ్డి తెలిపారు. 

అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

కేతేపల్లి : సహకార ఎన్నికల్లో 29మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.13 డైరెక్టర్‌ స్థానాలకు గాను మొత్తం 71నామినేషన్లు రాగా 2 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన వాటిలో సోమవారం రెండు సెట్లు నామినేషన్‌ వేసిన అభ్యర్థులు పోను మిగిలిన 34మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆయాస్థానాల నుంచి ఒక్కో వార్డుకు ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండగా 4, 5, 8 వార్డుల నుండి మాత్రం 3అభ్యర్థులు బరిలో మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. క్రమసంఖ్య ఆధారంగా బీరువా, బ్యాటు, టార్చ్‌లైటు గుర్తులను కేటాయించారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారి వెంకట్‌రెడ్డి, సీఈఓ యాదగిరి, సిబ్బంది వడ్డె నర్సయ్య, వెంకన్న పాల్గొన్నారు.

11మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవం

చిట్యాల : మండలంలోని మొత్తం 3 సహకార సంఘాల్లో 39మంది డైరెక్టర్ల కోసం జరుగుతున్న ఎన్నికల్లో 16మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా అందులో 11మంది టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే ఉన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక చొరతో ఈ 11మంది ఏకగ్రీవమయ్యారు.   నామినేషన్ల పరిశీలన అనంతరం మొత్తం 128 మంది మిగలగా 61మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 16మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 51మంది బరిలో మిగిలారు. చిట్యాల సంఘం పరిధిలో 5, వెల్మినేడులో 4, గుండ్రాంపల్లిలో ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

చిరుమర్తి ‘సహకార’ంతో నార్కట్‌పల్లి ఏకగ్రీవం దిశగా 

నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలంలో పీఏసీఎస్‌ పాలకవర్గం ఏకగ్రీవమైంది. మండలంలో  నార్కట్‌పల్లి, ఎల్లారెడ్డిగూడెం రెండు సహకార సంఘాలు ఉన్నాయి. నార్కట్‌పల్లి సహకార సంఘానికి 13వార్డులకు గాను 11వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎల్లారెడ్డిగూడెం సహకార సంఘంలో మొత్తం 12కు గాను 8ఏకగ్రీవమయ్యాయి. మెజార్టీ దిశగా టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం అయినందున నార్కట్‌పల్లి సహకార సంఘం చైర్మన్‌గా కసిరెడ్డి మదుసూధన్‌రెడ్డిని, ఎల్లారెడ్డిగూడెం చైర్మన్‌గా గంట్ల నర్సిరెడ్డిలను నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రకటించారు. దీంతో స్థానిక పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికకు సహకరించిన ప్రతిఒక్కరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.


logo