శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 11, 2020 , 02:43:04

నేటి నుంచి ‘పది’ ప్రీ-ఫైనల్‌

నేటి నుంచి ‘పది’ ప్రీ-ఫైనల్‌

నల్లగొండ విద్యావిభాగం: పదవ తరగతి ప్రీ-పైనల్‌ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు జిల్లా కామన్‌ బోర్డు ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం గత సంవత్సరం పదవతరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన సెట్‌-2 ప్రశ్న పత్రాలను అన్ని పాఠశాలలకు పంపించారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని 20,572 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.   

  20,572 మంది విద్యార్థులు

జిల్లా వ్యాప్తంగా 11 మేనేజ్‌మెంట్ల వారీగా మార్చి 2020లో జరిగే వార్షిక పరీక్షలకు 20,572 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరందరికి ఆయా యాజమాన్యాలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో 10,590 మంది బాలురు, 9,982 మంది బాలికలు ఉన్నారు. వీరికి ప్రస్తుతం నిర్వహించే ప్రీ ఫైనల్‌ పరీక్ష ఎంతగానో దోహద పడుతుంది

ప్రీ ఫైనల్‌ పరీక్షలు ఇలా

ఈ నెల 11 నుంచి 27 వరకు పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి 12.15గంటల వరకు నిర్వహిస్తారు. ఈ నెల 11న తెలుగు పేపర్‌-1, 12న తెలుగు పేపర్‌-2, 13న హిందీ, 26న ఇంగ్లీష్‌ పేపర్‌-1, 27న ఇంగ్లీష్‌ పేపర్‌-2, 17న గణితం పేపర్‌-1, 18న గణితం పేపర్‌-2, 19న పిజికల్‌ సైన్స్‌,  20న బయలాజికల్‌సైన్స్‌, 24న సోషల్‌ పేపర్‌-1, 25న సోషల్‌ పేపర్‌-2 నిర్వహిస్తారు. ఈ నెల 14, 15న జరిగే ఇంగ్లీష్‌ పేపర్‌ -1, 2 పరీక్షలను సహకార ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 26, 27తేదీలకు వాయిదా వేశారు. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులకు ఆ ఫలితాలను అందజేసి వేటిలో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని ఆయా సబ్జెక్టులపై మరింత శ్రద్ధ పెట్టనున్నారు.


logo