శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 10, 2020 , 01:37:05

వైభవంగా ప్రభబండ్ల ప్రదర్శన

 వైభవంగా ప్రభబండ్ల ప్రదర్శన
  • చీదెళ్లలో కొనసాగుతున్న లక్ష్మీతిరపతమ్మగోపయ్య స్వాముల జాతర
  • భక్తజనంతో కిక్కిరిసిన జాతర ప్రాంగణం


పెన్‌పహాడ్‌ : చీదెళ్ల గ్రామంలోని  శ్రీలక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల జాతర ఉత్సవాల్లో భాగంగా   దేవతా మూర్తులను ఊరేగింపు శనివారం వైభవంగా నిర్వహించారు.  ఉదయం వేదపండితులు ఆదివారం వేలాది భక్తజనం నడుమ అమ్మవారికి గణపతిపూజ, స్వస్తివచనం, రక్షాబంధనం, దీక్షాధారణ, అఖండ దీక్షాధారణ, సర్వతోభద్ర మ ండప దేవతా పూజలు, మహా నివేదిన నీరాజనం, మంత్రోపుష్ఫ ప్రసాద వితరణ వంటి ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం గ్రామస్తులు తమ పాడి పంటలు, పిల్లపాపలు చల్లంగా చూడాలని వేడుకుంటూ తమ ఎడ్లబండ్లకు, ట్రాక్టర్లకు ప్రభ బండ్లుగా అలంకరించి కోలాటాలు, బ్యాం డు మేళాలు, భజనలతో వీధివీధినా ఊరేగింపుగా వచ్చి దేవాలయ ప్రాంగణానికి చేరుకున్నా రు.    


శ్రీలక్ష్మీ తిరుపతమ్మకు నిష్టతో వండిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. అలాగే   పసు పు, కుంకుమ, సారెలు, గాజు లు, యాటపోతులు, కోళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించారు. సంతానం లేని మహిళలు  సంతానం కల్పించాలని నాగులమ్మకు ముడుపులు కట్టారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా వందలాది దుకాణాలు వెలిశాయి. దీంతోభక్తజనంతో జాతర ప్రాం గణమంతా కిక్కిరిసిపోయింది. ప్రభ బండ్ల ఊరేగింపుతో గ్రామానికి జాతర సందడి నెలకొంది. అంతేకాదు గ్రామం తా పండుగ వాతావరణం నెలకొంది. జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌, సర్పంచ్‌ పరెడ్డి సీతారాంరెడ్డి, ఎంపీటీసీ జూలకంటి వెంకటరెడ్డి, మాజీ చైర్మన్‌ వెన్న సీతారాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ గుర్రం అమృతారెడ్డి, గొట్టిపర్తి గోపయ్య  తెలిపారు.


logo