గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Feb 10, 2020 , 00:32:06

ముగిసిన నామినేషన్ల పరిశీలన

ముగిసిన నామినేషన్ల పరిశీలన
  • 598 డైరెక్టర్‌ పదవులకు
  • ఉపసంహరణల అనంతరం ఏకగ్రీవాలు పెరిగే అవకాశం
  • ఏకగ్రీవం కానున్న 69 డైరెక్టర్‌ పదవులు
  • నేడు ఉపసంహరణకు ఆఖరు
  • 2056 నామినేషన్లుహుజూర్‌నగర్‌రూరల్‌ : సహకార సంఘ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఆదివారం ఎన్నికల అధికారులు నామినేషన్ల స్క్రూటీ చేపట్టారు. మొత్తం ఐదు సహకార సంఘాల్లో వేపలసింగారం గ్రామంలో 8వ వార్డుకు వేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురైయింది. 8వ వార్డులో వడిగ వెంకయ్యను బలపరిచే అభ్యర్థి లేకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక మిగతా వాటిలో రెండు సెట్లు వేసిన చోట ఒక్కో సెట్‌ను మాత్రమే పరిగణిలోకి తీసుకోవడంతో లింగగిరిలో 39, వేపలసింగారంలో 17,  హుజూర్‌నగర్‌లో37, అమరవరంలో 39, బూరుగడ్డలో 55 నామినేషన్లు మిగిలాయి. మొత్తం ఐదు సహకార సంఘాల్లో 187 నామినేషన్లు నిలిచాయి.


మేళ్లచెర్వులో..

మేళ్లచెర్వు : మేళ్లచెర్వు పీఏసీఎస్‌ పరిధిలో నామినేషన్లు ముగిసే సమయానికి 56 నామినేషన్లు దాఖలు కాగా నలుగురు రెండు సెట్ల చొప్పున దాఖలు చేశారు. అవి పోను 13 వార్డులకు 52 మంది బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. కందిబండ పీఏసీఎస్‌ పరిధిలో 22 నామినేషన్లలో 13వ వార్డులో దాఖలైన నామినేషన్‌ సక్రమంగా లేకపోవడంతో తిరస్కరించగా 21 నామినేషన్లు ఉన్నట్లు ఎన్నికల అధికారి సైదానాయక్‌ తెలిపారు.  వీటిలో 6 వార్డులకు ఒక్కొక్క నామినేషన్‌ దాఖలైంది. 


మఠంంపల్లిలో..

మఠంంపల్లి : మఠంపల్లి మండలంలోని 13 డైరెక్టర్‌ స్థ్ధానాలకు 63 నామినేషన్లు దాఖలు కాగా అందులో 4 నామినేషన్లు తిరస్కరించబడినట్లు ఎన్నికల ప్రత్యేకాధికారి, మండల వ్యవసాయాధికారి బుంగా రాజు  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సోమవారం ఉపసంహరణ గడువు ఉంటుందని తెలిపారు. ఈ నెల 15న సహకార సంఘం ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. 


గరిడేపల్లిలో..

గరిడేపల్లి : మండలంలోని సర్వారం, రాయినిగూడెం పీఏసీఎస్‌లు, గడ్డిపల్లి రైతు సేవా సహకార సంఘాల నామినేషన్‌లను ఎన్నికల అధికారులు  పరిశీలించారు. సర్వారం పీఏసీఎస్‌ 68 నామినేషన్‌లు దాఖలు కాగా ఒకరు 2 సెట్లు వేయడంతో 67 నామినేషన్‌లు చెల్లుబాటు అయినట్లు ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాయినిగూడెం పీఏసీఎస్‌లో 79 నామినేషన్‌లు దాఖలు కాగా 7 నామినేషన్‌లు తిరష్కరణకు గురవడంతో ఐదుగురు రెండు సెట్ల నామినేషన్‌ వేయగా చివరికి 67 నామినేషన్‌లు చెట్లుబాటు అయినట్లు ఎన్నికల అధికారి నట్టె శ్రీనివాసరావు తెలిపారు. అదే విధంగా గడ్డిపల్లి రైతు సేవా సహకార సంఘంలో 40 నామినేషన్‌లకు అన్ని చెల్లుబాటు అయినట్లు ఎన్నికల అధికారి ప్రియతమ్‌కుమార్‌ తెలిపారు.


పాలకవీడులో..  

పాలకవీడు :  పాలకవీడు సహకార సంఘంలో దాఖలైన 66 నామినేషన్‌లకు 9 వార్డుకు సంభందించిన నల్లపు వెంకటేశ్వర్లు నామినేషన్‌ తిరస్కరించబడగా 65 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు  ఎన్నికల అధికారి ఆంజనేయులు విలేకరులకు తెలిపారు. వెంకటేశ్వర్లు  సహకారం సంఘానికి రూ. లక్షకు పైగా బకాయివుండడంతో  నామినేషన్‌ను తిరస్కరించినట్లు తెలిపారు. సోమవారం నామినేషన్ల ఉపసహంరణకు తుది గడవు అని చెప్పారు.


నేరేడుచర్లలో..

నేరేడుచర్ల : నామినేషణ్ల పరిశీలలో మండలంలోని పెంచికలదిన్న సహకార సంఘంలో 3 నామినేషన్‌లు తిరస్కరించారు. 4, 12, 13 వార్డులలో మర్రి వెంకటయ్య, చంచల సత్యనారాయణ,  రామలింగయ్యలు కుల దృవీకరణ పత్రాలు జత చేయకపోవడంతో నామినేషన్లు తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పెంచికలదిన్నలో 37 నామినేషన్లకు 3 తిరస్కరణ అనంతరం 34 ఉన్నాయి. 12వ వార్డులో  రెండు నామినేషన్లు దాఖలు కాగా సీపీఎం బలపరిచిన చంచల సత్యనారాయణ నామినేషన్‌ తిరస్కణకు గురవడంతో టీఆర్‌ఎస్‌ బలపరిచిన సోమగాని మురళి ఏకగ్రీవ ఎంపిక లాంఛనమే. 6 వార్డులో ఒక్క నామినేషన్‌ రావడంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి 2వార్డులు ఏకగ్రీవమైనాయి. నేరేడుచర్ల, చిల్లేపల్లి సహకార సంఘాల్లో  నామినేషన్లు సక్రమంగా ఉండడంతో తిరస్కరణకు గురికాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. 


చింతలపాలెంలో..

చింతలపాలెం : చింతలపాలెం సహకార సంఘంలో  40 నామినేషన్లు దాఖలు కాగా ఇద్దరు 2 సెట్లు దాఖలు చేశారు. 2 పోను 38 నామినేషన్లు ఉన్నట్లు ఎన్నికల అధికారి వీరయ్య తెలిపారు. దొండపాడు సహకార సంఘ పరిధిలో 46 నామినేషన్ల దాఖలైయ్యాయి. వాటిలో ఒక్కరే రెండు సెట్లు వేయగా ఆ నామినేషన్‌ తిరస్కరించగా 45 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని రెండు సహకార సంఘాల్లో మొత్తం 83 నామినేషన్లు ఉండగా వాటిలో చింతలపాలెంలో-38, దొండపాడులో-45 మంది ఉన్నారు.  


logo