శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 08, 2020 , 03:11:16

అభివృద్ధికి బాటలు వేసుకోవాలి

అభివృద్ధికి బాటలు వేసుకోవాలి
  • ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
  • అడిషనల్‌ డీజీపీ రాజీవ్త్రన్‌
  • మోతె మండలంలో పల్లె ప్రగతి పనుల పరిశీలన

మోతె : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్వహించిన పనులను పరిశీలించినట్లు అడిషనల్‌ డీజీపీ రాజీవ్త్రన్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొత్తగూడెం, హుస్సేనబాద్‌లో పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, హరితహారం వన నర్సరీలను పరిశీలించి సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. 


ప్రభుత్వ విడుదల చేస్తున్న నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. గ్రామాల్లో ప్రతి బజారుకు సీసీ రోడ్డు వేసి కళకళలాడే విధంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు.  గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెంలో ప్రభుత్వ పాఠశాల చుట్టు ప్రహరీ గోడను నిర్మా ణం చేయాలని కోరారు. హుస్సేనబాద్‌లో ప్రభుత్వ పాఠశాలలో వంటశాల, స్కూల్‌ భవనం మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీఐ శివశంకర్‌, ఎంపీపీ ముప్పాని ఆశశ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓ శంకర్‌రెడ్డి, సర్పంచ్‌ ఆరె పద్మ, శ్రీలత, ఎంపీటీసీ కట్కూరి ఉషా సంజీవరెడ్డి, ఏపీఓ వెంకన్న, టీఏలు, ఫీల్డ్‌అసిస్టెంట్లు పాల్గొన్నారు.


logo