మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 05, 2020 , 02:16:36

పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం వద్దు

పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం వద్దు

నేరేడుచర్ల : రాష్ట్ర ప్రభుత్వం పల్లె సీమలను పచ్చని సీమలుగా మార్చేందుకు చేపట్టిన పల్లెప్రగతి పనుల పురోగతిపై మంగళవారం రాష్ట్ర పరిశీలకుడు, రాష్ట్ర సీఐడీ అడిషనల్‌ డీజీ గోవింద్‌సింగ్‌ తనిఖీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి ఎన్‌. యాదయ్య, డీఎల్‌పీఓ కే. లక్ష్మీనారాయణ, డీఆర్డీఏ ఏపీడీ పెంటయ్యతో కలిసి మండలంలోని కల్లూరు, పెంచికలదిన్నె గ్రామాల్లో విస్తృ త స్థాయిలో కలియతిరిగి జరిగిన పనులపై పరిశీలన చేసి   అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదట కల్లూరు గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా రానున్న సీజనల్‌ లో మొక్కలు నాటేందుకు నిర్వహిస్తున్న నర్సరీని పరిశీలించారు. నర్సరీలో నీటి వసతి, మొక్కల పెంపకంపై ఆజమాయిషిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న రెండు అం గన్‌వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థుల వివరాలపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఆగ్రామ సర్పంచ్‌ పల్లెపంగ నాగరాజు అంగన్‌వాడీలకు స్వంత భవనాలు లేక ప్రభు త్వ పాఠశాలలో నిర్వహిస్తున్నామని, పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో పట్టపగలు సైతం విషసర్పాలు, తేళ్లు పాఠశాలలోకి, అంగన్‌వాడీ కేంద్రాల్లోకి జొరబడుతున్నాయని, కాపౌండ్‌ వాల్‌తో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు స్వంత భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించాలని కోరారు. వైకుంఠధామాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, రహదారి వెంట పెంచిన మొక్కల్లో అత్యధిక శాతం ఎండిపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనతరం పెంచికలదిన్నె గ్రామంలో నిర్మాణంలో  ఉన్న డంపింగ్‌ యార్డ్‌, శ్మశానవాటికను పరిశీలించి, ఈ ప్రాంతంలో  పనులు నత్తనడకన సాగుతున్నాయని నిధుల మంజూరులో జరుగుతున్న జాప్యం కారణమా లేక అధికారుల నిర్ల క్ష్యం కారణమా అని ఎంపీవో విజయకుమారిని ప్రశ్నించారు. పెంచికలదిన్నె అంగన్‌వాడీ కేంద్రాల్లో గాలి, వెలుతురు లేకుండా కిటికీలు మూసివేసి ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాఠశాలలో డిజిటల్‌ క్లాస్‌ రూంలు,  ప్రా థమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీపీ లకుమళ్ల జ్యోతిభిక్షం, కోదాడ డీఎస్పీ రఘు, హుజూర్‌నగర్‌ సీఐ రాఘవరావు, సీఐడీ ఎస్‌ఐ మదన్‌మోహన్‌రెడ్డి, తహసీల్దార్‌ రాంరెడ్డి, ఏపీఓ నాగయ్య, కల్లూరు గ్రామ ప్రత్యేకాధికారి సైదులు, పెంచికలదిన్నె సర్పంచ్‌ సుంకరి వాణి శ్రీరామ్మూర్తి, గ్రామ కార్యదర్శులు పోలిశెట్టి శ్రీనివాస్‌రావు, మామిడి శేఖర్‌, ఎంపీటీసీ లింగయ్య పాల్గొన్నారు.  


logo