గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Feb 05, 2020 , 02:14:36

సొసైటీలో గులాబీ జెండా ఎగురవేద్దాం

సొసైటీలో గులాబీ జెండా ఎగురవేద్దాం

మఠంపల్లి : మండలంలోని సహకార సంఘాలను కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగురవేద్దామని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మన్నెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో గ్రామాల్లో  సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమా వంటి  పథకాలో యావత్తు భారతదేశాన్ని ఆకర్షించారన్నారు. రైతుల సంక్షేమని కృషి చేసిన టీఆర్‌ఎస్‌  అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముడావత్‌ కొండానాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గుండా బ్రహ్మారెడ్డి, కోలాహలం క్రిష్ణంరాజు, పఠాన్‌హఫీజ్‌ఖాన్‌, సాముల పుల్లారెడ్డి, సీతారాంరెడ్డి, కీసర వెంకన్న, మన్నెం శేషిరెడ్డి, గుర్రం మట్టారెడ్డి, రాంరెడ్డి, గ్రంథాలయం చైర్మన్‌ భద్రంరాజు రామారావు, మండల ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు రవీందర్‌నాయక్‌, భరత్‌నాయక్‌, నాగునాయక్‌, కోటానయక్‌,  నాగేశ్వరరావు, సర్పంచ్‌లు లక్ష్మీనరసింహరాజు, పాండునాయక్‌ పాల్గొన్నారు. 

గెలుపే లక్ష్యంగా పని చేయాలి : దర్గారావు

పాలకవీడు : ఈ నెల 15న జరగబోయే ప్రాథమిక వ్యవసాయ సహకరా సంఘం ఎన్నికల్లో పాలకవీడు చైర్మన్‌ పీఠం టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకునే లక్ష్యంగా నాయకలు, కార్యకర్తలు కలిసి పని చేయాలని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మలమంటి దర్గారావు అన్నారు. స్థ్ధానిక పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార ఎన్నికల్లో మండలంలోని ఒక్కటే సహకార సంఘం ఉందని అందులో 13 మంది డైరెక్టర్లు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందే విధంగా పని చేయాలన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి యరేడ్ల సత్యనారాయణరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డీనేటర్‌ దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు కిష్టపాటి అంజిరెడ్డి, నేరేడుచర్ల జెడ్పీటీసీ, వైస్‌ ఎంపీపీ, రాపోలు నర్సయ్య, తాళ్లూరి లక్ష్మీనారాయణ, నాయకులు రాచంద్రనాయక్‌, లక్ష్మీనారాయణ, వెంకటరెడ్డి, దాదేఖాన్‌, రవినాయక్‌, ఆశోక్‌ నాయక్‌, శేషు, గణపతి రెడ్డి, సైదిరెడ్డి, గోపాల్‌, జానిరెడ్డి, సుబ్బు, ఉద్యానాయక్‌, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.logo