మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 03, 2020 , 03:00:42

కందుల కొనుగోళ్లకు సిద్ధం

కందుల కొనుగోళ్లకు సిద్ధం

సూర్యాపేట అర్బన్‌ : రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కందుల కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు  చేసింది.  నాఫెడ్‌ ద్వా రా కొనుగోలు చేసి మద్దతు ధర రూ. 5800 అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అనేక రకాల ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసిన ప్రభు త్వం మరో రెండు,మూడు రోజుల్లో కందులను కొ ను గోలుకు ఏర్పాట్లు చేస్తుంది. జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరిలో కందుల కొనుగోలు కేంద్రాల ను ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సారి రైతుల నుంచి 1216 మెట్రిక్‌ టన్నులు (24 వేల బస్తాలు) కొనుగోలు లక్ష్యంగా ఉంది.

 జిల్లాలో వరి తరువాత అత్యధికంగా పండించే పంటల్లో పెసర, కంది, వేరుశనగ  ఉంటుంది. కంది ని ప్రత్యేకంగా సాగు చేయడంతో పాటు వానాకాలం తరువాత అంతర్‌ పంటలుగా వేస్తుంటారు.  ఈ సా రి జిల్లా వ్యాప్తంగా 6083 హెక్టార్లు సాగు  చేయగా ప్రతి ఎకరాకు 6-8 క్వింటాళ్ల  దిగుబడి రా నుంది. ఇప్పటికే మార్కెట్‌కు ధాన్యం వస్తుండడంతో ఈ నెల 5 లోపు కేంద్రాలను ప్రారంభించనున్నది. జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి మార్కెట్‌ల్లో  కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా కొనుగోలును నాఫెడ్‌ ద్వారా ప్రాథమిక సహకార సంఘా ల పంట కొనుగోళ్లు చేస్తారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం రూ.125 పెంచి అందించనున్నది. ప్ర స్తుతం మార్కెట్‌లో వ్యాపారులు క్వింటాకు రూ. 4800 మాత్రమే చెల్లిస్తుండగా సర్కారు ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాకు రూ.1000 అదనంగా రైతులకు రానున్నది.

జిల్లాలోని రెండు మార్కెట్లలో  ఈ సారి 12 వేల క్వింటాళ్ల కొనుగోలు లక్ష్యం పెట్టుకున్నారు. ఈ మేరకు లక్ష్యాన్ని తగినంతగా కొనుగోలు చేసేందుకు జిల్లా అధికారులు సంబంధింత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి తగు సూచనలు చేశారు. ప్రభు త్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని, గతంలో ఎదురైనా సమస్యలను గుర్తిం చి పునరావృతం కాకుండా చూడాలన్నారు. అయితే రైతులు పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు  మా ర్కెట్‌కు కంది పంటను తీసుకువచ్చే రైతు లు ప్ర భుత్వం నిర్ధేశించిన నాణ్యతా ప్రమాణాలను తప్పకుండా పాటించాలి. వీటితో పాటు రైతులు వా రి పట్టాదారు పాసుపుస్తకం,బ్యాంకు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలను తీసుకుని రావాలి.

1. తేమ 12 శాతానికి మించకుండా ఉండాలి.

2. కందులలో ఇతర పదార్థాలు 2 శాతం మించ కూడదు.

3. ఇతర పంట గింజలు 3 శాతానికి మించ కూడదు

4.దెబ్బ తగిలిన గింజలు 3 శాతానికి మించ కూడదు

5. కొద్దిగా దెబ్బతగిలిన గింజలు ,రంగు మారిన గింజలు 4 శాతం మించ కూడదు.

6.అపక్వం ,ముడుచుకొని పోయిన గింజలు 3 శాతానికి మించ కూడదు

7. పురుగు పట్టిన గింజలు 4 శాతానికి మించ కూడదు 


logo