శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 03, 2020 , 02:54:47

ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములవ్వాలి

 ప్రతి ఒక్కరూ  గ్రామాభివృద్ధిలో భాగస్వాములవ్వాలి

తుంగతుర్తి : రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములవ్వాలని  సూర్యాపేట జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాలలో రూ.9లక్షలతో చేపట్టిన నూతన ల్యాబ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం తుంగతుర్తి గ్రామపంచాయతీ నిధులతో తీసుకున్న నూతన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే స్వయంగా డ్రైవింగ్‌ చేసి ప్రారంభించడంతోపాటు మెయిన్‌రోడ్‌పై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాల్లో అభివృద్ధిని తలంచి పల్లెప్రగతి 1, 2 కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ ఆంజనేయులు, ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్‌, వైస్‌ ఎంపీపీ శ్రీశైలంయాదవ్‌, గుడిపాటి సైదులు, ఓరుగంటి సత్యనారాయణ, దాయం విక్రంరెడ్డి, తాటికొండ సీతయ్య, నల్లు రాంచంద్రారెడ్డి, సర్పంచ్‌ సంకినేని స్వరూపారవీందర్‌రావు, ఉప్పుల పద్మ, సృజన, పులుసు యాదగిరి, కటకం వెంకటేశ్వర్లు, గోపగాని రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  
logo