శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 03, 2020 , 02:52:26

సాగర్‌ నీటి మట్టం @553.20 అడుగులు

సాగర్‌ నీటి మట్టం @553.20 అడుగులు


నందికొండ : నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులకు గాను ఆదివారం 553.20 అడుగుల వద్ద 216.8832 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్‌ డ్యాం నుంచి కుడి కాల్వ ద్వారా 2,327 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 9,626 క్యూసెక్కులు,  ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,200 క్యూసెక్కులు, డిటీ గేట్సు ద్వారా 10క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. సాగర్‌ డ్యాం నుంచి మొత్తం 14,463 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండగా, ప్రధాన జల విద్యుత్‌కేంద్రం నీటి విడుదల లేదు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 869.90 అడుగుల వద్ద 141.3285 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం నుంచి నాగార్జునసాగర్‌కు 14,649 క్యూసెక్కుల  ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.


logo