మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 02, 2020 , 04:05:32

అంగరంగ వైభవంగా..

అంగరంగ వైభవంగా..
  • చెరువుగట్టుపై బ్రహ్మోత్సవ సంబురం
  • ప్రత్యేక పూజల్లో కలెక్టర్‌, ఎమ్మెల్యే
  • నేడే కల్యాణోత్సవం, తలంబ్రాల ఘట్టం

నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ చంద్రశేఖర్‌లు లాంఛనంగా ప్రారంభించారు. ఆరు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో ముందుగా ఆలయ ఈఓ సులోచన, దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డిలు యాజ్జికులు అల్లవరపు సుబ్రహ్మణ్యం, దీక్షీతావదాని, ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ పరిపట్టం కట్టి ఆలయ సంప్రదాయ ప్రకారం సన్నాయి వాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో వారికి ఎదురెల్లి స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని ఆలయ మహా మండపంలో వేద పండితులు శివశ్రీ పి. నీలకంఠ శివాచార్య, యాత్వికులు గణపతి పూజతో ఉదయం ఉత్పవాల ప్రారంభ క్రతువును నిర్వహించారు. యాగశాల ప్రదక్షిణి, గణపతి పూ జ, మహన్యాస పూర్వాక ఏకాదశ రుద్రాభిషేకం, పుణ్యహవాచలము, పంచగవ్య పూజ, ప్రోక్షణ, ప్రాషన, ఋద్విగ్వరణ, దీక్షాదరణ, అఖండస్ధాపన త్రిశూల పూజ సూర్య నమస్కార పూజలు చేశారు. అగ్ని ప్రతిష్ఠాపనతో సృష్టికర్త బ్రహ్మ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించే ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇన్‌చార్జి కలెక్టర్‌ చంద్రశేఖర్‌లను ఈఓ సులోచన, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డిలు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. 


సీఎం కేసీఆర్‌కు చెర్వుగట్టు విశిష్టత తెలుసు : ఎమ్మెల్యే చిరుమర్తి

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టత సీఎం కేసీఆర్‌కు తెలుసని, త్వరలోనే ఈ క్షేత్రానికి వస్తాడని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. శనివారం చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన అనంతరం  రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని దానికి నిదర్శనం చెరువుగట్టు క్షేత్రమేనని గుర్తుచేశారు. మహిమ గల క్షేత్రం చెరువుగట్టు కనుక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే గట్టుపై భక్తులకు అన్నిరకాల మౌలిక సదుపాయాలు కలగజేశామని తెలిపారు. అనంతరం పోలీసు సిబ్బంది ఏర్పాటుచేసిన సీసీ కెమరాల ఫుటేజ్‌ను, కల్యాణ మండపంను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీష్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, చిట్యాల మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చిన్నవెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ సాంబశివరావు, తాసిల్దార్‌ రాధ, సర్పంచ్‌ మల్గ బాలకృష్ణ, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, కొండూరు శంకర్‌, సాగర్ల సైదులు, ప్రభాకర్‌రెడ్డి, గంట నర్సిరెడ్డి, గోదల వెంకట్‌రెడ్డి, కన్నెబోయిన సైదులు, దోసపాటి విష్ణు, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, రాధారపు విజయలక్ష్మీ భిక్షపతి, పసునూరి శ్రీను, మేడి శంకర్‌, అల్గుబెల్లి సత్తిరెడ్డి, జెనిగ నాగరాజు, మేకల కరుణాకర్‌రెడ్డి, బత్తుల అనంతరెడ్డి, దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


ప్లాస్టిక్హ్రిత జాతరగా పేరుతేవాలి : ఆర్డీఓ  

ప్లాస్టిక్‌ మహమ్మారిని పూర్తిస్థాయిలో తరిమివేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేసి ప్లాస్టిక్హ్రిత జాతరగా చెర్వుగట్టుకు పేరు తేవాలని ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఇప్పటివరకు జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాలలో ప్లాస్టిక్‌ కవర్‌లను వాడకూడదని అట్టి యజమానులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. కొబ్బరికాయలు, ప్రసాదాలు తీసుకునే సమయంలో ఇంటివద్ద నుండి తెచ్చుకున్న బట్ట సంచులను ఉపయోగించాలని భక్తులను కోరారు.


logo