శుక్రవారం 29 మే 2020
Suryapet - Feb 02, 2020 , 03:59:03

ఎంజీయూ డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ఎంజీయూ డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల
  • ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన రిజిస్ట్రార్‌ యాదగిరి, సీఓఈ రమేశ్‌
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సత్తాచాటిన ‘గురుకుల’ విద్యార్థులు ఎంజీయూ డిగ్రీ సెమిస్టర్‌

నల్లగొండ విద్యావిభాగం : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ 1, 3, 5వ  సెమిస్టర్స్‌ డిసెంబర్‌-2019 పరీక్షల ఫలితాలను శనివారం ఎంజీయూలో రిజిస్ట్రార్‌ ప్రొ.ఎం.యాదగిరి, సీఓఈ మిర్యాల రమేశ్‌ విడుదల చేశారు. ఫలితాల్లో బాలికలే అత్యధింగా ఉత్తీర్ణత సాధించారు. గిరిజన, సాంఘీక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉమ్మడి జిల్లాలోనే అన్ని కళాశాలల కంటే అత్యధిక ఫలితాలు సాధించి సత్తాచాటడం గమనార్హం. కార్యక్రమంలో ఎంజీయూ అసిస్టెంట్‌ సీఓఈలు అరుణప్రియ, శ్వేత, తిరుమల, పీజీ కోఆర్డినేటర్‌ చిల్కురి రమేష్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రేఖ, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ అల్వాల రవి, ఆర్ట్స్‌, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాళ్లు అంజిరెడ్డి, సంధ్యారాణి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వసంత, ఆడిట్‌ సెల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సబీనా, ప్రొగ్రామర్‌ వెంకటాచారి, వివిధ విభాగాల బీఓఎస్‌లు, హెచ్‌వోడీలు పాల్గొన్నారు. 


మోబైల్‌ యాఫ్‌లో ఫలితాలు...

విద్యార్థులు ఫలితాలను సులభంగా చూసుకునే విధంగా యూనివర్సిటీ మోబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. గుగూల్‌ ఫ్లెస్టోర్‌లో ‘ఎంజీరిజల్ట్స్‌' అని యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థి హాల్‌టికెట్‌ నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీ ఎంటర్‌ చేయాగానే ఫలితాలు వస్తాయి. ఒక్క పర్యాయం రిజిస్టర్‌ అయితే విద్యార్థికి సంబంధించిన ఫలితాలు ప్రతిసారి నేరుగా మొబైల్‌కు వస్తాయి. 


‘గురుకుల’ విద్యార్థుల సత్తా...

గతంలో కంటే  ఈ పర్యాయం డిగ్రీ సెమిస్టర్స్‌లో గురుకుల డిగ్రీ కళాశాలల విద్యార్థులు  సత్తాచాటారు. ఉమ్మడి జిల్లాలో మొదటి ఐదు స్థానాల్లో నిలువడం హరణీయంగా చెప్పావచ్చు. మిగిలిన కళాశాలల కంటే గురుకుల విద్యార్థులు అత్యధిక గ్రేడ్‌ పాయింట్లు సాధించి ముందంజలో నిలిచారు. 


logo