బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 01, 2020 , 01:43:51

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ఉల్లాసంగా.. ఉత్సాహంగా
  • కిట్స్‌ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో
  • అలరించిన ఆటపాటలు, ఫ్యాషన్‌ షోలు
  • ముగిసిన జాతీయ స్థాయి టెక్నికల్‌ ఫెస్ట్‌-2కే20

కోదాడటౌన్‌: కోదాడ  కిట్స్‌ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండురోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టెక్నికల్‌ ఫెస్ట్‌ 2కే20 శుక్రవారంతో ముగిశాయి.  ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులకు పాటల పోటీలు,నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్‌ షోలు, గ్రూపు నృత్య ప్రదర్శన  పోటీలను నిర్వహించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. కళాశాల ప్రాంగణ మంతా ఆట పాటలతో మార్మోగింది కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ సీహెచ్‌. నాగార్జునరావు,   స్పర్థ కన్వీనర్‌ స్రవంతి, కో-కన్వీన ర్‌ జనార్దన్‌, క ళాశాల అధ్యాపకులు రమేష్‌,నరేష్‌ రెడ్డి, ఎజాజ్‌, ప్రవీణ్‌,సూర్య శేఖర్‌, శ్రీ ను, కిరణ్మయి, సునీత, చైతన్య, విద్యార్థినులు పాల్గొన్నారు


logo