శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 31, 2020 , 01:44:07

రేపటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

రేపటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌
  • ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు..
  • 71 కళాశాలలకు 50 సెంటర్ల ఏర్పాటు
  • హాజరుకానున్న 11,083 మంది విద్యార్థులు

సూర్యాపేట అర్బన్‌  :  సూర్యాపేట జిల్లా వ్యాప్తంగాప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇంటర్మీడియట్‌  చదువుతున్న విద్యార్థులు హాజరుకానున్న ప్రయోగ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను చేశారు. పరీక్షల నిర్వహణ కోసం అనుభవం కలిగిన ఇన్విజిలేటర్లను నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహి ం చనున్నారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లతో పాటు జిల్లా పరీక్షల ని ర్వహణ కమిటీలు ఎప్పటికప్పుడు పరీక్షలను పరిశీలించనున్నా రు. ప్రాక్టికల్స్‌కు సంబంధించిన పేపర్‌ను అరగంట ముందుగా పరీక్ష కేంద్రంలోని ప్రిన్సిపాల్‌కు తెలపనున్నారు. పరీక్షల అనంతరం మూ ల్యాంకనం చేసిన మార్కులను ఆన్‌లైన్‌లో బోర్డుకు అందించాల్సి ఉంటుంది.


 50 కేంద్రాలు సిద్ధం

 జిల్లాలోని సాంఘిక సంక్షేమ ,గిరిజన సంక్షేమ, కేజీబీవీ,రెసిడెన్షియల్‌, మోడల్‌  స్కూల్‌, ఎయిడెడ్‌ , ఒకేషనల్‌ కళాశాలలు , ప్రైవేటు కళాశాలతో పాటు జిల్లాలోని మొత్తం 71 కళాశా లల్లో చదువుతున్న సు మారు 11,083 మంది విద్యార్థ్ధులుహాజరుకానున్న పరీక్షల నిర్వహణ కోసం 50  కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్ష  కేంద్రాలుగా ఉన్న కళాశాలలకు ఇప్పటికే సమాచారం అందించడంతో పాటు వాటి నిర్వహణపై అవగాహన తరగతులను ఏర్పాటు చేసిన అవగాహన కల్పించారు.


రెండు విడుతలుగా పరీక్షలు  

 ఇంటర్మీడియట్‌ విద్యార్థ్ధులకు ప్రారంభం కానున్న ప్రాక్టికల్స్‌ పరీక్షలను ఫిబ్రవరి 1 ను ంచి  20వ తేదీ వరకు రెండు విడుతలుగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను రెండు విడతలుగా గ్రూపుల వారీగా విడదీసిన కళాశాలల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధ్దం చేశారు.


logo