బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 31, 2020 , 01:33:22

ఎంజీయూ లెర్నింగ్‌ రిసోర్స్‌ అవార్డ్స్‌ విజేతల జాబితా వెల్లడి

  ఎంజీయూ లెర్నింగ్‌ రిసోర్స్‌ అవార్డ్స్‌ విజేతల జాబితా వెల్లడి

నల్లగొండ విద్యావిభాగం : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల బీఈడీ కళాశాలల ఛాత్రోపాధ్యాయులకు(విద్యార్థులు)ఈనెల 24న పండిట్‌ మదన్‌మోహన్‌ మాలవ్య జాతీయ మిషన్‌, ఎంజీయూ-ఓయూ సంయుక్తంగా నిర్వహించిన ఎంజీ యూనివర్సిటీ స్థాయి లెర్నింగ్‌ రిసోర్స్‌ అవార్డ్స్‌ ప్రదర్శన, పోటీల్లో విజేతలైన వారి జాబితాను గురువారం రిజిస్ట్రార్‌ ప్రొ.ఎం.యాదగిరి విడుదల చేశారు. ఎంజీయూలోని తన చాంబర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. రాష్ట్రస్థాయిలో జరిగే ప్రదర్శనలో ఎంజీయూ ఖ్యాతి చాటాలని కోరారు. ప్రదర్శన కన్వీనర్‌, ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ డా.అల్వాల రవి మాట్లాడుతూ గణితం, ఫిజిక్స్‌, బయాలజీతోపాటు సాంఘీక, తెలుగు, ఆంగ్లం మెథడాలజీల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. 


ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు ప్రోత్సాహక బహుమతులు సాధించినవారు సైతం రాష్ట్ర స్థాయికి అర్హులే అన్నారు. విజేతల జాబితాను ఉమ్మడి జిల్లాలోని బీఈడీ కళాశాలల మెయిల్స్‌కు పంపినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి ప్రదర్శన ఫిబ్రవరిలో జరుగుతుందని, అందుకు సంబంధించిన వివరాలు, తేదీలను రాష్ట్ర నిర్వాహకుల నుంచి ఆదేశాలు రాగానే వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో లెర్నింగ్‌ రిసోర్స్‌ అవార్డ్స్‌ ఎంజీయూ కో ఆర్డినేటర్‌, డీవీఎం కళాశాల ప్రిన్సిపాల్‌ బి. నారాయణరెడ్డి, సహాయ కో ఆర్డినేటర్‌, శ్రీరాఘవేంద్ర కళాశాల సీనియర్‌ అధ్యాపకుడు బొడ్డుపల్లి రామకృష్ణ పాల్గొన్నారు


logo