మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 31, 2020 , 01:14:23

ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

సూర్యాపేటఅర్బన్‌  : రేపటి  నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి జానపాటి కృష్ణయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మొదటి స్పెషల్‌ ఎగ్జామినర్లకు, డిపార్టుమెంట్‌ అధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్షలను నిర్వహించాలన్నారు. పరీక్షల సమయం లో సమస్యలు ఏర్పడితే సంబంధింత శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని సక్రమంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.  కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ రుద్రంగి రవి, శ్రీని వాస్‌,వివిధ కళాశాలల అధ్యాపకులు  తదితరులుపాల్గొన్నారు.


logo