బుధవారం 03 జూన్ 2020
Suryapet - Jan 30, 2020 , 00:39:54

సమిష్టి కృషితోనే మెరుగైన ఫలితాలు

సమిష్టి కృషితోనే మెరుగైన ఫలితాలు

అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారం, సమిష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లామని, పెద్దగట్టు జాతర, హరితహారం, పల్లె ప్రగతి, భూ రికార్డులపై ప్రజలతో ముఖా ముఖి, ఎన్నికలు తదితర కార్యక్రమాలు సజావుగా నిర్వహించామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్తున్న దుగ్యాల అమయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయనకు అధికారులు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.

  • ప్రతి ప్రభుత్వ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాం
  • కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

 సూర్యాపేట జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ:  జిల్లాను అన్ని రంగాల్లో అధికారుల సమిష్టి కృషితోనే సాధ్యమైందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్తున్న కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక బాలాజీగార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో జేసీ సంజీవరెడ్డితో కలిసి ఆయన  మాట్లాడారు. సూర్యాపేట జిల్లాపై ఎంతో ప్రేమ ఉందని జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అధికారుల సమిష్టికృషితోనే అమలు చేయడం జరిగిందన్నారు. జిల్లా లో దాదాపుగా అన్ని మండలాల్లో భూ రికార్డుల శుద్దీకరణ ముఖాముఖి కార్యక్రమం ఒక ఆదర్శంగా నిలిచిందన్నారు. ముఖ్యంగా వరదల సమయంలో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరుగకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోనైందన్నారు. 


జిల్లాలో అతిపెద్ద జాతరైన లింగమంతులస్వామి జాతర, హరితహారం, పల్లె ప్రగతి అలాగే ఎన్నికలన్నీ సజావుగా సమర్థవంతంగా నిర్వహించామన్నారు. కలెక్టర్‌గా జిల్లాకు సేవ  చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాన న్నారు. జిల్లాలో ప్రజాప్రతినిదులు, పత్రికా ప్రతినిదులు అందరూ ఎంతో సహకరించారని అన్నారు. అనంతరం జేసీ సంజీవరెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌గా జిల్లాలో అ ధికారులకు, సి బ్బందికి మంచి నిర్ణయా లను అ ందిస్తూ ప్రతి ఒ క్కరికి గు ర్తుండిపోయేలా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు. 


అనంతరం రెవెన్యూ అధికారులు, జిల్లా అ ధికారులు, పోలీసు అధికారులు, టీఎన్‌జీఓఎస్‌ అధ్యక్ష, కార్యదర్శులు కనిమియ, దున్న శ్యాం అన్ని శాఖల సిబ్బంది తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో సూర్యాపేట ఆర్డీఓ మోహన్‌రావు, కోదాడ ఆర్డీఓ కిషోర్‌కుమార్‌, సీఈఓ విజయలక్ష్మి, పీడీ కిరణ్‌కుమార్‌, డీఎస్పీ నాగేశ్వర్‌రావు, ఏడీఏ జ్యో తిర్మయి, సం క్షేమ అధికారులు జ్యోతి, శ్రీనివాస్‌, నర్సింహారావు, జీఎం ఇండస్ట్రీయల్‌ తిరుపతయ్య, డీసీఓ ప్రసాద్‌, డీపీఆర్‌ఓ ప్రసాదరావు, తాసిల్దార్లు , ఎంపీడీఓలు,    వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 


logo