బుధవారం 03 జూన్ 2020
Suryapet - Jan 30, 2020 , 00:38:41

శెభాష్‌.. జగదీశ్‌..

శెభాష్‌.. జగదీశ్‌..
  • మున్సిపల్‌ ఎన్నికల్లో విజయంపై మంత్రి జగదీశ్‌రెడ్డిని అభినందించిన
  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి సూర్యాపేట మున్సిపల్‌ చైర్మన్‌ పదవి జనరల్‌ కేటగిరీలో ఉన్నప్పటికీ ఎస్సీ మహిళ పెరుమాళ్ల అన్నపూర్ణకు ఇచ్చి చరిత్ర సృష్టించావని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని పురపాలకశాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభినందించారు. ‘అద్భుతాన్ని సృష్టించావు.. సూర్యాపేట చరిత్రను సార్థకం చేశావు.. శెభాష్‌ జగదీశ్వరా శెభాష్‌' అంటూ గుండెలకు హత్తుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి జిల్లాకు చెందిన ఐదు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, కౌన్సిలర్లు కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలువగా ఈ అపూర్వ ఘటన చోటుచేసుకుంది.   


జిల్లాకు చెందిన సూర్యాపేట కోదాడ, హుజూర్‌నగర్‌, తుంగతుర్తి, నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్మన్లు  బుధవారం హైదరాబాద్‌లోపురపాలకశాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్‌, బొల్లం మల్లయ్య యాదవ్‌, శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.  


logo