సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 28, 2020 , 03:26:49

యావత్‌ ప్రజానీకం టీఆర్‌ఎస్‌ వెంటే

యావత్‌ ప్రజానీకం టీఆర్‌ఎస్‌ వెంటే

సూర్యాపేట టౌన్‌ : ఉద్యమ కాలంలోనే అందరి కష్టాలు తెలుసుకుని పోరాడి సాధించుకున్న తెలం గాణలో ప్రజలు నచ్చి, మెచ్చి వేసిన ఓటుతో గెలిపించుకున్న నాటి ఉద్యమ రథసారథి, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రతిపక్ష నేతలు సహా అన్ని కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.. దీంతో యావత్‌ ప్రజానీకం టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటూ ఏ ఎన్నికలొచ్చినా గులాబీ జెండాకే పట్టం కడుతున్నారు.. అదే విషయాన్ని ఈ పురపాలిక ఎన్నికలతో మరోమారు రుజువు చేశారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.  సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌గా పుట్ట కిశోర్‌ల ఎన్నిక అనంతరం మంత్రి జగదీష్‌ రెడ్డి వారిని అభినందించి విలేకరులతో మాట్లాడారు.  జనరల్‌ మహిళ స్థానంలో దళిత మహిళకు అవకాశం కలిపించడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇది రాజకీయ చరిత్రలో పెనుమార్పుకు సంకేతమన్నారు. ముందుగానే ఈ విషయాన్ని  సీఎం కేసీఆర్‌, మంత్రి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల ఎదుట ఉంచానని.. వారి అనుమతితోనే పేట చైర్‌పర్సన్‌గా అన్నపూర్ణకు అవకాశం కల్పించామన్నారు.  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతి కొనసాగాలన్నారు. 2014, 2018 ఎన్నికల ముందు సూ ర్యాపేటకు ప్రత్యేకంగా మేనిఫెస్టో ఇచ్చి చేపట్టిన పనులు చాలా వరకు పూర్తికాగా కొన్ని పురోగతిలో ఉన్నాయని వీటితో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. అందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ వెంటే ఉంటూ ఓటర్లంతా ఏకమై మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను గెలిపించి భారీ విజయం కట్టబెట్టారన్నారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచే పేదల పక్షపాతిగా మహిళలకు పెద్దపీట వేస్తూ నిరంతరం అభివృధ్ధి పాలన కొనసాగిస్తున్నామన్నారు.  జిల్లాలో ఇప్పటికే జడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు జిల్లాలో అన్ని మున్సిపల్‌ స్థానాల్లో మహిళలకే చైర్‌పర్సన్లుగా అవకాశం కల్పించామన్నారు. ఈ పురపాలిక ఎన్నికల ఫలితాలు విపక్షాలకు చెంపపెట్టుగా నిలిచాయన్నారు. రాబోయే రోజుల్లో అందరి సహకారంతో సూ ర్యాపేటను మరింత సుందరంగా తీర్చిదిద్దుకుందామన్నారు.


logo