గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 28, 2020 , 03:03:38

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు వీరే..

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు వీరే..

సూర్యాపేట జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకుగాను సోమవారం నాలుగు మున్సిపాలిటీల  చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక  జరిగింది. ఆయా మున్సిపాలిటీల్లో ఉదయం 11గంటలకు నూతన కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించిన అధికారులు అనంతరం సభ్యులందరు కలిసి 12.30గంటలకు సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకున్నారు. సూర్యాపేట వైస్‌ చైర్మన్‌గా పుట్ట కిశోర్‌(టీఆర్‌ఎస్‌)ఎన్నికవగా, కోదాడ వెంపటి పద్మ(టీఆర్‌ఎస్‌), హుజూర్‌నగర్‌(టీఆర్‌ఎస్‌) జక్కుల నాగేశ్వర్‌రావు, తిరుమలగిరి సంకేపల్లి రఘునందన్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌)లను ఎన్నుకున్నారు. ఎన్నికైన వీరిని పలువురు అభినందించారు. కాగా, నేరేడుచర్ల చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను నేడు ఎన్నుకోనున్నారు. 


logo