శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 25, 2020 , 01:24:50

కౌంటింగ్ ప్ర క్రియను పకడ్బందీగా నిర్వహించాలి

కౌంటింగ్  ప్ర క్రియను పకడ్బందీగా నిర్వహించాలిసూర్యాపేట, నమస్తేతెలంగాణ : నేడు నిర్వహించే 5 మున్సిపాల్టీల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ చంపాలాల్ అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్,  ఎస్పీ ఆర్.భాస్కరన్ తో కలిసి వేర్వేరుగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ నిర్వహణ ప్రక్రియకు నియమించిన అధికారులు, సిబ్బంది అందరూ 6.30గంటలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నా రు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించిన అనంతరం కౌంటింగ్ నిర్వహణ ప్రారంభించాలన్నారు. బాక్సుల్లోని ఓట్ల మిక్సింగ్ బాక్సుల్లో వేసి అనంతరం పార్టీల గుర్తుల వారిగా విభజించాలని అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ముఖ్యంగా అధికారులు, సిబ్బం ది ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ సెం టర్‌లోకి అనుమతించవద్దన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారులదే పూర్తి బాధ్యతని మున్సిపల్ కమిషనర్‌లు బాధ్యులు కారన్నారు. 

సమస్యలు తలెత్తకుండా  జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమయంలో విద్యు త్ అంతరాయం లేకుండా చూడాలని, అలాగే కౌం టింగ్ హాళ్లలో సరిపడా ఫ్యాన్‌లు బిగించాలని ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని  కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపుకు నియమించిన అధికారులు, సిబ్బంది అంతా తప్పకుండా వారికి జారీ చేసిన గుర్తింపు కార్డు లో సకాలంలో హాజరు కావాలన్నారు. కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ హాల్‌లోకి సంబంధిత పోటీ చేసిన అభ్యర్ధి కానీ వారు నియమించిన ఏజెంటు కానీ ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే కౌంటింగ్‌హాల్‌లకు అనుమతించడం జరుగుతుందన్నారు. ఓసారి కౌంటింగ్ హాల్‌లోకి వచ్చిన ఏజెంటు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ల రాదన్నారు. ఒక వేళ వెళితే తిరిగి అనుమతించబడదని అన్నారు. కౌంటింగ్‌హాల్ పరిసర ప్రాంతాల్లో మొబైల్‌ఫోన్‌ల అనుమతి లేనందున కౌంటింగ్‌కు వచ్చే అధికారులు, సిబ్బంది భద్రతాదళ సిబ్బంది ఎవ్వరూ కూడా మొబైల్ ఫోన్‌లతో రావద్దన్నారు. పార్టీ ఏజెంట్లు అభ్యర్ధులు, పాత్రికేయులు, భద్రతా  సిబ్బంది వారికి జారీ చేసిన గుర్తింపు కార్డులు తప్పకుండా తీసుకురావాలన్నారు. కౌంటింగ్ సందర్బంగా వార్డుల వారీగా ప్రతి రౌండ్‌కు సంబంధించిన  ఫలితాలు మైకుల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుందని కాబట్టి ఎవరూ కూడా కౌంటింగ్‌హాల్ వద్దకు రావద్దన్నారు. కోదాడ, నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్లు  ఉడెన్ ట్రేలకు బదులుగా ప్లాస్టిక్ ట్రేలు ఏర్పాటు చే యగా వాటిని వెంటనే తొలగించి ఉడేన్ ట్రేలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జేసీ సంజీవరెడ్డి, డీఆర్వో పి.చంద్రయ్య,  జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి.జ్యోతి, పట్టణ సీఐ శివశంకర్  సీఈఓ విజయలక్ష్మి, ఆర్డీఓ కిశోర్‌కుమార్,  మున్సిపల్ కమిషనర్లు సిబ్బంది పాల్గొన్నారు.

కౌంటింగ్ వద్ద అసౌకర్యం  కలగకుండా చూడాలి  : జేసీ సంజీవరెడ్డి

  కోదాడ, హు జూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాల్టీల్లో ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలో ఉన్నం దున కౌంటింగ్ డ్యూటీలకు వచ్చే సిబ్బందికి, అధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా   ఏర్పా ట్లు చేయాలని జేసీ డి. సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం  కౌంటింగ్ సెంటర్లను ఆయన పరిశీలించి మా ట్లాడారు.  మొదటి రౌండ్‌కు సంబంధించిన అభ్యర్ధులు ఏజెంట్లు ఉదయం 6 గంటలకే ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకోవాల న్నారు. logo